Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

sweet memories: చంద్రబాబులో ఆ మార్పుతో - ఊహించని విధంగా..!!

ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబులో సడన్ ఛేంజ్. చంద్రబాబు ముందు పార్టీలో..బయటా ఎవరూ హద్దులు దాటలేరు. చొరవ తీసుకొని మాట్లాడలేరు. తొలి నుంచి ప్రతీ చోటా అదే "పట్టు" తో నెట్టుకొచ్చారు. అటువంటి చంద్రబాబు లో ఒక్క సారిగా మార్పు కనిపించింది. ఆ మార్పు నిత్యం ఆయనతో ఉండే వారే ఊహించలేకపోయారు.తమ అధినేతతో తమతో మమేకం అవ్వటం తో వారి సంతోషానికి హద్దులు లేవు. ఇటువంటి అరుదైన సందర్భానికి చంద్రబాబు నివాసం వేదికైంది.

టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేసారు. అది మూములు భోజనం కాదు. 449 రకాలతో ఏర్పాటు చేసిన విందు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ప‌నిచేసే అటెండ‌ర్ నుంచి మేనేజ‌ర్ వ‌ర‌కూ, సెక్యూరిటీ గార్డు నుంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ వ‌ర‌కూ, హౌస్ కీపింగ్ సిబ్బంది నుంచి కార్యాల‌య కార్య‌ద‌ర్శి వ‌ర‌కూ అంద‌రినీ ఈ విందుకు ఆహ్వానించారు. ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వారితో కలిసి తాను విందులో పాల్గొన్నారు. ప్రతీ ఒక్కిరినీ పేరుతో పిలచి..వారితో కలిసి ఫొటోలు దిగారు.

Sweet Memories: TDP Chief Chandrababu seen in a different role, hosts dinner party to his staff

అందరి భోజనాలు అయ్యే దాకా వారి మధ్యనే ఉన్నారు. వారితో దిగిన ఫొటోలను వారి వాట్సప్ కు పంపాలంటూ సిబ్బందికి సూచించారు. చంద్రబాబు వచ్చారంటేనే సైలెంట్ అయిపోయి..వారి పనుల్లో నిమగ్నమయ్యే సిబ్బంది..తమ అధినేత ఒక్క సారిగా తమ మధ్యకే రావటం ఒక స్వీట్ మెమోరీగా చెప్పుకున్నారు. అందునా..స్వయంగా వారితో కలిసి భోజనం చేయటం.. వారిని ఆప్యాయంగా పలకరించటంతో అ సమయం వారికి చిర‌కాల జ్ఞాప‌కంగా నిలిచిపోనుంది.

ఎప్పుడూ అంత గంభీరంగా కనిపిస్తూ...నిత్యం సమావేశాల్లో ఉండే చంద్రబాబు.. ఇలా భిన్నంగా తమతో కలిసి పోవటం.. తమ సమయం కేటాయించటంతో వారి ఆనందానికి హద్దులు లేవు. హౌస్ కీపింగ్ సిబ్బందిని పలకరిస్తూ చంద్రబాబు భోజనం చేశారా అని అడుగుతుంటే..వారంతా చాలా గొప్పగా ఫీలయ్యారు. చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు చూసుకుంటూ మురిసిపోయారు. ఇప్పుడు ఈ అరుదైన డిన్నర్..టీడీపీలో ఆసక్తికర చర్చగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+