బిల్లు ఆమోదం: తెలంగాణ ప్రజల సంబరాలు (పిక్చర్స్)

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ పది జిల్లాల్లో ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో న్యూఢిల్లీలోని ఏపి‌భవన్‌లో ఉన్న తెలంగాణ వాదులు అక్కడే నృత్యాలు చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో టపాసులు పేల్చుతూ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాస్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత నాయకులందరూ పార్టీలకతీతంగా మిఠాయిలు పంచుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ మొదలగు జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని వేడుకలు చేసుకున్నారు.

జై తెలంగాణ నినాదాలు

జై తెలంగాణ నినాదాలు

తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో జై తెలంగాణ నినాదాలు చేస్తున్న ప్రజలు.

యువకుల ఆనందం

యువకుల ఆనందం

హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో టపాసులు పేల్చుతూ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళుతున్న యువకులు.

మిఠాయిలు పంచుకుంటూ..

మిఠాయిలు పంచుకుంటూ..

తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మిఠాయిలు పంచుకుంటున్న న్యాయవాదులు.

నృత్యాలు చేస్తూ..

నృత్యాలు చేస్తూ..

తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న యువకులు.

ఏబివిపి కార్యకర్తల ఆనందం

ఏబివిపి కార్యకర్తల ఆనందం

తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జై తెలంగాణ నినాదాలు చేస్తున్న ఏబివిపి కార్యకర్తలు.

టపాసులు కాల్చుతూ..

టపాసులు కాల్చుతూ..

తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో టపాసులు కాలుస్తూ.. న్యాయవాదులు నృత్యాలు చేశారు.

ఈల వెస్తూ..

ఈల వెస్తూ..

తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో ఈలలు వేస్తూ.. జై తెలంగాణ నినాదాలు చేస్తున్న న్యాయవాదులు.

నృత్యాలు చేస్తూ..

నృత్యాలు చేస్తూ..

తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో టపాసులు కాలుస్తూ.. నృత్యాలు చేస్తున్న న్యాయవాదులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+