పవన్ కళ్యాణ్‌కు టిలోను డిమాండ్: త్వరలో ప్రచారం
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డిమాండ్ పెరుగుతోంది. తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని ఆయనను కోరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పవన్ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలంగాణలో బిజెపి తరఫున ప్రచారం చేయాలని కోరారు. ఆ తర్వాత విజయవాడ సెంటర్ల టిడిపి అభ్యర్థి బొండా ఉమామహేశ్వర రావు గెలిచి తన నియోజకవర్గంలో ప్రచారం చేయాలని పవన్‌ను ఇటీవల కోరారు.

శనివారం మరికొందరు తెలంగాణ ప్రాంత నేతలు జనసేన అధ్యక్షుడిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, బిజెపి తరపున తెలంగాణలో ప్రచారం చేయాలని నేతలు పవన్‌ను కోరినట్లు తెలుస్తోంది.
ఈ నెల 22 తర్వాత ప్రచారానికి వస్తానని నేతలకు పవన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బండారు దత్తాత్రేయ సహా మరికొంతమంది పవన్‌ను కలిశారు. పవన్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేస్తామని బండారు దత్తాత్రేయ చెప్పారు. కాగా, వీరిద్దరు గంటకు పైగా మంతనాలు జరిపారు.












Click it and Unblock the Notifications