Local Bhai Nani: ఏపీ యూట్యూబర్‌పై సజ్జనార్ సీరియస్, డీజీపీకి రిక్వెస్ట్

సైబర్ క్రైమ్స్, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యూట్యూబర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని సూచన చేస్తూ.. సదరు యూట్యూబర్ చేస్తున్న మోసంపై ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.

యూట్యూబర్ లోకల్‌బాయ్ నాని చేసిన బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ లోకల్‌బాయ్ నానిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్‌ను కోరారు. డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయని.. బెట్టింగ్ భూతాలను ప్రమోట్ చేసి ప్రజలను చెడగొట్టవద్దని హితవు పలికారు. యువతను బెట్టింగ్ యాప్‌లకు బానిసలను చేయడం సరికాదన్నారు. చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు .

Take action against YouTuber Local Boy Nani TGSRTC MD Sajjanar asks AP DGP

'చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు' అని సజ్జనార్ మండిపడ్డారు.

'మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి' అని ప్రజలకు సజ్జనార్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+