మరోసారి కూటమి అభ్యర్దుల మార్పు - ఎవరెక్కడ.!!

ఏపీ ఎన్నికల రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. కూటమిలో సీట్ల సర్దుబాటులో కొత్త మార్పులు తెర మీదకు వస్తున్నాయి. మూడు పార్టీల సీట్ల లెక్కల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అనపర్తి నుంచి సీటు కోల్పోయిన నల్లమిల్లి తాజాగా చంద్రబాబును కలిసారు. అదే విధంగా జమ్మల మడుగు సీటు బీజేపీకి వెళ్లింది. అక్కడ మార్పు జరిగే ఛాన్స్ ఉంది. కడప ఎంపీ సీటులోనూ అభ్యర్ది మారనున్నట్లు సమాచారం.

సీట్ల మార్పు
పొత్తులో భాగంగా కడప జిల్లాలో రెండు స్థానాలు బీజేపీకి దక్కాయి. అందులో జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు ప్రకటించారు. అక్కడ టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి సీటు పైన నమ్మకం పెట్టుకున్నారు. బీజేపీకి సీటు కేటాయించటంతో భూపేష్ కు టీడీపీ నుంచి కడప ఎంపీ సీటు కేటాయించారు. కానీ, తాజాగా కడప జిల్లాలో మార్పుల వైపు కసరత్తు జరుగుతోంది. తాను పోటీ చేస్తున్న జమ్మలమడుగు సీటు టీడీపీకి కేటాయించి..కడప పార్లమెంట్ సీటు తీసుకొనేలా బీజేపీ నాయకత్వంతో ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం మొదలు పెట్టారు.

TDP and BJP seats in Kadapa dist may change Adinarayana reddy liklely to contest for loksabaha

కడప జిల్లాలో కొత్త లెక్కలు
దీని ద్వారా కడప ఎంపీగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. జమ్మలమడుగు నుంచి భూపేష్ టీడీపీ క్యాండిడేట్ గా బరిలో నిలిచేలా చర్చలు సాగుతున్నాయి. తాజా ప్రతిపాదనకు బీజేపీ అంగీకరిస్తే మరో ఎంపీ సీటు బీజేపీకి పెరగనుంది. టీడీపీకి మరో అసెంబ్లీ సీటు దక్కనుంది. ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల తరువాత బీజేపీలో చేరారు. జమ్మలమడుగు నుంచి పోటీ చేసేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ లబించింది. కానీ, కుటుంబం నుంచి వస్తున్న సూచనలతో ఆదినారాయణ రెడ్డి కడప నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకొచ్చారు.

బీజేపీ అంగీకరించేనా
వైసీపీ నుంచి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి షర్మిలారెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ అంగీకరిస్తే తాజా మార్పులు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నుంచి భూపేష్ పోటీ చేయాలని కమలం పార్టీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనికి భూపేష్ సిద్దంగా లేరని సమాచారం. టీడీపీకి జమ్మలమడుగు సీటు కేటాయిస్తే పోటీలో నిలవాలనే ఆలోచన చేస్తున్నారు. బీజేపీ అంగీకరించకపోతే ప్రస్తుతం ప్రకటించినట్లుగానే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి, భూపేష్ కడప ఎంపీగా పోటీలో నిలవనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+