ఎంపీ కేశినేని ఇంట పెళ్లి సందడి - చంద్రబాబు పెద్దరికం..!!

టీడీపీ ఎంపీ కేశినేని ఇంట పెళ్లి సందడి. నాని కుమార్తె శ్వేత వివాహంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. కేశినేని నాని కుమార్తె శ్వేత, శాసనసభ మాజీ స్పీకర్ కాజ రామనాథం మనవడు రఘు వివాహం ఘనంగా జరిగింది. పార్టీలో కేశినేని నాని వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతున్న వేళ.. రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు సతీ సమేతంగా హాజరైన వధూవరునుల ఆశీర్వదించారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నారా లోకేష్ ఈ వివాహానికి హాజరయ్యారు.

కేశినేని ఇంట వివాహ వేడుకలో చంద్రబాబు

కేశినేని ఇంట వివాహ వేడుకలో చంద్రబాబు

టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత- శాసనసభ మాజీ స్పీకర్ కాజ రామనాథం మనవడు రఘు వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని బౌండరీ హిల్స్ లో వివాహ వేడుక నిర్వహించారు. టీడీపీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. వివాహానికి రావాలంటూ రతన్ టాటాను కేశినేని నాని ఆహ్వానించారు. కేశినేని శ్వేత, రఘుల నిశ్చితార్థం గత జులై 31న జరిగింది. హైదరాబాదులోని హోటల్ తాజ్ కృష్ణలో నిశ్చితార్థం కూడా పెళ్లి స్థాయిలో ఘనంగా నిర్వహించారు. నిశ్చితార్ధానికి చంద్రబాబు కుటుంబ సభ్యులతో సహా హాజరై ఆశీర్వదించారు. ఇటు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని టీడీపీ స్థానిక నేతల తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు.

కేశినేనికి తగ్గని ప్రాధాన్యత

కేశినేనికి తగ్గని ప్రాధాన్యత

చంద్రబాబు జిల్లాలో కొందరు నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత కేశినేని నానికి రుచించటం లేదు. దీంతో, ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ సమీక్షల్లోనూ తన అభిప్రాయాలను కేశినేని నేని స్పష్టంగా పార్టీ అధినేతకు వెల్లడించారనే ప్రచారం ఉంది. అదే సమయంలో తన సోదరుడితో సమస్యలు ఏర్పడిన సమయంలో కొందరు పార్టీ నేతలు అవకాశంగా మలచుకొనే ప్రయత్నం చేయటం పైన నాని ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం కేశినేని నాని - చిన్ని వ్యవహారం వారి కుటుంబ సమస్యగానే భావిస్తున్నారు. కేశినేనికి స్థానికంగా కొందరు నేతలు విభేదాలు మినహా.. పార్టీ అధినాయకత్వంతో ఎలాంటి సమస్య లేదని ముఖ్య నేతలు చెబుతున్నారు.

కేశినేని ఎన్నికల్లో పోటీ - మనసు మార్చుకుంటారా

కేశినేని ఎన్నికల్లో పోటీ - మనసు మార్చుకుంటారా

తాజాగా, కేశినేని ఇంట జరిగిన కార్యక్రమాల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులతో సహా హాజరు కావటం..ఆత్మీయంగా ఉండటం ద్వారా తనకు కేశినేని తో ఎటువంటి సమస్య లేదనే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేశినేని కుమార్తె శ్వేత ఇప్పటికే టీడీపీలో యాక్టివ్ అయ్యారు. విజయవాడ నగర రాజకీయాల్లో బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, కేశినేని ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ గతంలో కేశినేని చెప్పినట్లుగా ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు ఆయన తిరిగి టీడీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే అనుమానం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+