ఆయనేమో తిరుగుతున్నారు.. వీరేమో 'వ్యాపారాలు' చేసుకుంటున్నారు?
వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అహరహం శ్రమిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ పేరుతో జిల్లాలు పర్యటిస్తున్నారు. ప్రతి జిల్లాలోను మూడు నియోజకవర్గాలను చుట్టివస్తున్నారు. ఇటీవలే తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పర్యటన పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం జీవో నెంబరు 1 ద్వారా అనుమతివ్వకపోవడంతో అక్కడే పాదయాత్ర నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి సంఘీభావం తెలియజేశారు.

నియోజకవర్గ ఇన్ ఛార్జిల వైఖరి?
చంద్రబాబు పర్యటనకు వెళ్లిన సమయంలో నియోజకవర్గాల ఇన్ఛార్జిలు తీవ్ర హడావిడి చేస్తున్నారు. పర్యటన ముగిసిన తర్వాత చూస్తే.. వీరేనా హడావిడి చేసింది అని అనిపించక మానదు. గతంలో భారత క్రికెటర్లను కాగితం పులులుగా పోల్చేవారు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జిలను కూడా కాగితం పులులుగానే రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎన్నిసార్లు చంద్రబాబు హెచ్చరిస్తున్నా వీరి పద్ధతులు మాత్రం మార్చుకోలేదని, ఒకవైపు పార్టీలో కొనసాగుతూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలతో కలిసి వ్యాపారాలు చేయడం, వాణిజ్యం చేయడంలాంటివి చేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ చంద్రబాబు మాత్రం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు.

యువతరానికి అవకాశం ఇవ్వమంటున్నారు..
మారుతున్న కాలంతోపాటు చంద్రబాబు తన మనస్తత్వాన్ని మార్చుకోకపోవడం, సున్నితంగా ఉండటం, మొహమాటలం లాంటి వైఖరులతో చంద్రబాబు వారిని ఎన్నిసార్లు విమర్శించిన వారు తిరిగి ఆయన దగ్గరకే చేరుతున్నారు. ఆయన వెంటనే క్షమించేస్తున్నారు. పార్టీకి ఈ తరహా వైఖరి చేటు చేస్తుందని, ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి పనిచేయని ఇన్ ఛార్జిలను తొలగించి యువతరానికి అవకాశం ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. పనిచేయనివారిని బాబు హెచ్చరిస్తూ సమయం ఇస్తున్నప్పటికీ వీరంతా తేలికగా తీసుకుంటున్నారు.

రెండింటినీ సమంగా చూస్తేనే..
నిర్లక్ష్యం, అలసత్వతో పార్టీ బలోపేతానికి కృషిచేయడంలేదు. చంద్రబాబునాయుడి రాజకీయ ఆలోచనలవల్ల గతంలో అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థులను ఏమీ చేయలేదని, ప్రస్తుతం జగన్ పార్టీ నేతలపై దాడులు చేయిస్తూ, వారిని వెనకడుగు వేయించేలా చేస్తూ వైసీపీని బలోపేతం చేస్తున్నారని, తిరిగి అధికారంలోకి వచ్చినా అధినేత చంద్రబాబు మాత్రం పార్టీపై దృష్టిపెట్టకుండా పాలనపై దృష్టిపెడతారని, రెండింటినీ సమంగా చూసినప్పుడే పార్టీ బలోపేతంతోపాటు అధికారం దక్కుతుందని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications