వైసీపీ సంక్షేమ పథకాలపై చంద్రబాబు వ్యూహం?

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీలో మేధోమథనం జరుగుతోంది. బాదుడే బాదుడు, మహానాడుతోపాటు మినీ మహానాడులు విజయవంతమవడంతోపాటు చంద్రబాబు ఏ పర్యటనకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బాబుపై సానుభూతి కావొచ్చు.. లేదంటే అధికార వైసీపీపై వ్యతిరేకత కావచ్చు.. అంశం ఏదైనాకానీ ఆదరణ ఉంటోందనేది మాత్రం స్పష్టమవుతోంది.

నియోజకవర్గాల్లో కదలని నాయకా గణం

నియోజకవర్గాల్లో కదలని నాయకా గణం

అయితే ఈ ఆదరణ ఎన్నికల వరకు కొనసాగుతుందా? ఓట్ల రూపంలోకి మళ్లుతుందా? అంటే ఆ పార్టీ నేతలెవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గాల్లోని నేతల వైఖరే ఇందుకు కారణమవుతోంది. 72 సంవత్సరాల వయసున్న చంద్రబాబు కదులుతున్నారుకానీ నాయకులు కదలడంలేదు. నియోజకవర్గాలవారీగా, జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నేతలను హెచ్చరిస్తూనే ఉన్నారు. తనదగ్గర సరైన సమాచారం ఉందని, గతంలోలా ఎటువంటి మొహమాటం లేదని, ప్రజలతో మమేకమవకపోతే ఎట్టి పరిస్థితుల్లోను సీటివ్వనని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. బాగా పనిచేస్తున్న నేతలను మెచ్చుకుంటున్నారు. ఇటువంటివారు తక్కువ సంఖ్యలో ఉన్నారు.

సంక్షేమంపై టీడీపీ వ్యూహమేంటి?

సంక్షేమంపై టీడీపీ వ్యూహమేంటి?

'గడప గడపకు మన ప్రభుత్వం' పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉధృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. రానున్న ఎన్నికల్లో సంక్షేమ పథకాలపై ఎటువంటి వ్యూహం అవలంబించానేది పార్టీ ఖరారు చేయలేదు.

పథకాలు నిలిపేస్తారంటూ వైసీపీ ప్రచారం

పథకాలు నిలిపేస్తారంటూ వైసీపీ ప్రచారం

గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం 'పసుపు-కుంకుమ' పథకం పేరుతో డ్వాక్రా మహిళకు రూ.10వేలను అందజేసినప్పటికీ ఓట్లను తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు వివిధ పథకాల రూపంలో ప్రజలకు వేలరూపాయలు వచ్చిపడుతున్నాయి. వీటికి అలవాటుపడినవారు టీడీపీకి ఓటు వేస్తారా? పోలింగ్ కు వచ్చేసరికి వారు ఎలా వ్యవహరించబోతున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపైనే పార్టీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.

సంక్షేమ పథకాలు అమలవుతున్నందుకు ప్రజలంతా తమవైపే ఉన్నారనే ధీమాతో వైసీపీ ఉంది. ప్రభుత్వం మారితే పథకాలన్నీ నిలిపివేస్తారంటూ ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాల నుంచి ఓటర్లను టీడీపీవైపు తిప్పడానికి చంద్రబాబు ఎటువంటి వ్యూహం అవలంబించబోతున్నారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యూహం ఏమిటనేది ఎన్నికల సమయంలోనే తెలియనుంది. అప్పటివరకు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+