పీలేరు జైల్లో టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ-వైసీపీ అడ్డంకులపై అచ్చెన్నఫైర్.. !
ఏపీలో కుప్పం రాజకీయాలు రేపుతున్న కాక రోజురోజుకూ తీవ్రమవుతోంది. కుప్పంలో తాజాగా చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో అరెస్టైన పుంగనూరు టీడీపీ నేతల్ని పీలేరు సబ్ జైల్లో ఉంచారు. వీరిని పరామర్శించేందుకు చంద్రబాబు ఇవాళ పీలేరు వచ్చారు. దీంతో చంద్రబాబు రాకను తెలుసుకున్న వైసీపీ నేతలు ఆయన్ను గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.
పీలేరు జైల్లో టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ-వైసీపీ అడ్డంకులపై అచ్చెన్నఫైర్..!!#Chandrababu #Atchannaidu #TDP #PileruSubJail #PileruJail #AndhraPradesh #AndhraNews #Oneindiatelugu pic.twitter.com/uDCGSO5itx
— oneindiatelugu (@oneindiatelugu) January 16, 2023
అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు రాకను నిరసిస్తూ ఇవాళ వైసీపీ నేతలు చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ప్రతిగా నిరసనకు దిగాయి. దీంతో పీలేరులో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. వైసీపీ నేతల్ని సర్దిచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే చంద్రబాబు పీలేరు వచ్చారు. టీడీపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పీలేరు సబ్ జైలుకు చేరుకున్న చంద్రబాబు టీడీపీ నేతల్ని పరామర్శించారు.

మరోవైపు పీలేరులో చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షనేత పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగమే అన్నారు.మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడల్ని డీజీపీ నివారించాలన్నారు. అక్రమ కేసులతో పండుగ పూట పుంగనూరు టీడీపీ నేతల్ని మంత్రి పెద్దిరెడ్డి జైలులో పెట్టించి పెత్త తప్పు చేశారన్నారు. పండగపూట జైలులో ఉన్నవారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలకమానదన్నారు. బాధితుల పరామార్శకు వెళ్తున ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి బ్యానర్లు కట్టిండం టీడీపీ బ్యానర్లు చించడం మరో తప్పన్నారు. ప్రతిపక్ష నేత పర్యటనకు వ్యతిరేకంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి సర్కిల్ ఇన్స్ పెక్టర్ చేత 30 యాక్టు నోటీసు ఇప్పించడం అధికార దుర్వినియోగమేనని అచ్చెన్న విమర్శించారు. డీజీపీ జోక్యం చేసుకొని ప్రతిపక్ష నేత పర్యటన సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications