టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమి .. అగమ్య గోచరంగా చంద్రబాబు పరిస్థితి

Recommended Video

    Ap Assembly Results 2019 : టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమి... అగమ్య గోచరంగా చంద్రబాబు పరిస్థితి

    టీడీపీ ఊహించనిది జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది . 1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని టీడీపీ చవి చూసింది . దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అటు కేంద్రంలో మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలో వైసీపీ సర్కార్ .. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలు కూడా లేని చంద్రబాబు ఏం చెయ్యబోతున్నాడు . ఇప్పుడు చంద్రబాబు ముందు ఉంది అతి పెద్ద సమస్య జగన్ కూడా కేసీఆర్ తరహా వ్యూహం అవలంబిస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆలోచింపజేస్తున్న ప్రశ్న .

    టీడీపీ ఏర్పాటు చేసిన నాటి నుండి తొలిసారి ఘోర పరాభవం

    టీడీపీ ఏర్పాటు చేసిన నాటి నుండి తొలిసారి ఘోర పరాభవం

    1982 మార్చ్ 29 న తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఐదుసార్లు విజయం సాధించిన టీడీపీ.. నాలుగు సార్లు ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఓడిన టీడీపీకి అప్పట్లో 90 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మరోమారు ఓటమి పాలైంది. అప్పుడు 47 సీట్లు మాత్రమే వచ్చాయి. 2009లో ఓడినా 90 సీట్లు వచ్చాయి. అప్పుడు రాష్ట్రం ఉమ్మడిగా ఉంది.ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీకి ఇది తొలి ఓటమి. ఇప్పుడు కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే ఇంత ఘోర పరాజయం ఎప్పుడు ఎదురు కాలేదు.

    చంద్రబాబు భవిష్యత్ వ్యూహం ఏంటి ?

    చంద్రబాబు భవిష్యత్ వ్యూహం ఏంటి ?

    ఇక, లోక్‌సభ విషయానికొస్తే మూడంటే మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అత్యధిక స్థానాలు ఏపీలో గెలవాలని, కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించాలని ఎన్నికల ముందు నుండీ ఎన్నో ప్రయత్నాలు చేసిన చంద్రబాబుకు వచ్చిన ఫలితాలు షాక్ ఇచ్చాయి. అటు ఏపీలో, ఇటు కేంద్రంలో రెండు చోట్ల దెబ్బ తిన్న చంద్రబాబు ఇప్పుడేమి చెయ్యబోతున్నారు. చంద్రబాబు భవిష్యత్ వ్యూహం ఏంటి ? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం.

    అందరితో విరోధం పెంచుకున్న చంద్రబాబు టీడీపీని ఎలా కాపాడుకుంటారో ?

    అందరితో విరోధం పెంచుకున్న చంద్రబాబు టీడీపీని ఎలా కాపాడుకుంటారో ?

    ఒక పక్క స్పష్టమైన మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ , మరో పక్క ఏపీలోనూ ఏకపక్షంగా వీచిన ఫ్యాన్ గాలి చంద్రబాబును ఇరకాటంలో పెట్టనున్నాయన్న సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి. ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బీజేపీయేతర కూటమి ద్వారా దేశంలో అధికారం సాధించాలని ప్రయత్నాలు చేసిన చంద్రబాబుపై బీజేపీ ఇప్పటికే ఆగ్రహంతో ఉంది. ఇక ఇంత కాలం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ చంద్రబాబు హయాంలో పడిన ఇబ్బందుల నేపధ్యంలో ఇప్పుడు అధికారంలోకి రానున్న నేపధ్యంలో ఏం చెయ్యనున్నారో. ఒకపక్క మోడీతో, మరో పక్క కేసీఆర్ తో, ఏపీలోని ప్రత్యర్ధి పార్టీతో విరోధం పెంచుకున్న చంద్రబాబు ఇప్పుడు అధికారం లేకుండా ఎలా గట్టెక్కుతారో.. టీడీపీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+