పవన్ పై ప్రేమ-చంద్రబాబుపై కోపం - బీజేపీది భయమా ? వ్యూహమా ?

ఏపీలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారడం మొదలుపెట్టాయి. ఇందులో అందరికీ తెలిసింది కొన్నయితే.. అంతకు మించి తెరవెనుక జరుగుతున్నయి మరెన్నో ఉన్నాయి. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోతాడులే అని నిర్లక్ష్యం చేసిన బీజేపీ ఇప్పుడు సడన్ గా ఆయనపై నిత్యం అవాజ్యమైన ప్రేమ కురిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబుతో ఈ మధ్య కలిసినట్లే కలిసి ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో విమర్శలకు దిగుతోంది. దీని వెనుక ఆసక్తికర కారణాలున్నాయి.

 చంద్రబాబు-పవన్ భేటీ రాజకీయం

చంద్రబాబు-పవన్ భేటీ రాజకీయం


విశాఖ ఘటనల నేపథ్యంలో అమరావతికి తిరిగివచ్చిన పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు విజయవాడ నోవోటెల్ హోటల్ కు వెళ్లి కలవడం, దాదాపు గంటసేపు జరిగిన చర్చల్లో వైసీపీకి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటంపై ఇరువురు నేతలు చర్చించడం వరకూ అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేస్తున్న విమర్శల దాడిని నిజంచేస్తూ ఇరువురూ మళ్లీ కలిసిపోవడంతో ఇప్పుడు వైసీపీ విమర్శల దాడి పాతదైపోయింది. అదే సమయంలో పవన్-చంద్రబాబు భేటీ అప్పటికే జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో చిచ్చు రేపింది.

పవన్ పై బీజేపీ కొత్త ప్రేమ ?

పవన్ పై బీజేపీ కొత్త ప్రేమ ?


పవన్- చంద్రబాబు భేటీ తర్వాత బీజేపీ స్పందించింది. చంద్రబాబు పవన్ ను పరామర్శించడాన్ని సోము వీర్రాజు ఆహ్వానించారు. ఆ తర్వాత సోముతో పాటు మిగతా బీజేపీ నేతలు కూడా రోజువారీ పవన్ కళ్యాణ్ తమతోనే ఉంటాడని, వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే పోటీ చేస్తామని, పవన్ తో తమ సంబంధాలు యథాతథంగా ఉంటాయని, ఇలా నిత్యం పవన్ కు తాము దగ్గరగానే ఉంటున్నట్లు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ అడిగిన వైసీపీ వ్యతిరేక రోడ్ మ్యాప్ మాత్రం ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు. దీంతో పవన్ పై బీజేపీ కురిపిస్తున్న ఆకస్మిక ప్రేమకు కారణాలపై చర్చ మొదలైంది.

చంద్రబాబుపై బీజేపీ నిప్పులు

చంద్రబాబుపై బీజేపీ నిప్పులు

అదే సమయంలో చంద్రబాబుతో పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు లేదు.. కేవలం జనసేన-బీజేపీ పొత్తు మాత్రమే కొనసాగుతుందని పదే పదే చెప్తున్నారు. అంతే కాదు చంద్రబాబు గతంలో తమకు చేసింది మర్చిపోలేదని, విశాఖలో పవన్ పై దాడిని నిరసిస్తున్న చంద్రబాబు.. గతంలో తాను అమిత్ షాపై రాళ్లు వేయించింది మర్చికూడదంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందంటూ మాత్రమే చెప్పగలుగుతున్నారు.

 బీజేపీది భయమా ? వ్యూహమా

బీజేపీది భయమా ? వ్యూహమా


తాజా పరిణామాల్ని గమనిస్తుంటే బీజేపీ పవన్ పై కురిపిస్తున్న ఆకస్మిక ప్రేమ, అలాగే చంద్రబాబుపై మొదలుపెట్టిన విమర్శల వెనుక ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇన్నాళ్లూ తాము సహకరించినా, సహకరించకపోయినా, కలిసి వెళ్లకపోయినా మౌనంగా కలిసి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టి టీడీపీ తమవైపు తిప్పుకుంటోందనే ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు ఇప్పుడు తాజా పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ పవన్ తో పొత్తుకు సిద్దమవుతున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో వీరిద్దరి పొత్తు కుదరకుండా ఉండేందుకు తాము పవన్ తో పాటు ఉన్నామని, ఇతర పార్టీలతో కలవబోమని పదే పదే చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం ఎక్కువ రోజులు ఫలించడం కష్టమేనని మూడు పార్టీల నేతలు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+