నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత-రేవంత్ కు హ్యాట్సాఫ్ చెప్పిన ఆనం..!
హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. చెరువును ఆక్రమించి నాగార్జునకు చెందిన ఎన్ 3 రియాల్టీ ఎంటర్ ప్రైజెస్ దీన్ని నిర్మించింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయడం, ఇవాళ అధికారులు కూల్చివేయడం జరిగిపోయాయి. దీనిపై ఏపీ టీడీపీ నేత ఆనం స్పందించారు.

Hats off revanth garu n convention Gachibowli demolition drive,@revanth_anumula pic.twitter.com/O55PenJgnM
— Anam Venkata Ramana Reddy (@anamramana) August 24, 2024
హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ ఇవాళ గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో చేపట్టిన కూల్చివేతలపై నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. దీన్ని సమర్థిస్తూ ఎక్స్ లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆనం హ్యాట్సాఫ్ తెలిపారు. గచ్చిబౌలిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసినందుకు రేవంత్ రెడ్డికి హ్యాట్సాఫ్ అని ఆయన పోస్టు చేశారు.
ఏపీలో కూటమి సర్కార్ కు, టాలీవుడ్ పరిశ్రమకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే టీడీపీకి చూసినా టాలీవుడ్ ప్రముఖులతో సత్సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేసిన ఓ పనిని ఇక్కడ టీడీపీ నేత సమర్థిస్తూ హ్యాట్సాఫ్ చెప్పడం ఏంటన్న చర్చ జరుగుతోంది. అదీ కాక చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరుంది. ఆ కారణంతో ఆనం ఇవాళ రేవంత్ కు హ్యాట్సాఫ్ చెప్పారన్న వాదన కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications