Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా అబ్బాయికి ఎంపీ టికెట్ అడగరూ..టీడీపీ సీనియర్ నేత సెల్ఫీ వీడియో రిక్వెస్ట్..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టికెట్ల కోసం లాబీయింగ్ కూడా అంతే స్ధాయిలో పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై నేతల్లో క్లారిటీ వచ్చేస్తోంది. అదే సమయంలో టికెట్ల కోసం నేతల చుట్టూ తిరగడం కూడా ఎక్కువైంది. తమకు, తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఓవైపు అధినేతల చుట్టూ తిరుగుతూనే, మరోవైపు క్షేత్రస్ధాయిలో ప్రయత్నాలతో ఒత్తిడి పెంచుతున్నారు.

ఇదే క్రమంలో ఇవాళ కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన టీడీపీ శ్రేణులకు రెండు విజ్ఞప్తులు చేశారు. ఓ ఎమ్మెల్యే టికెట్ తో పాటు మరో ఎంపీ టికెట్ కోసం జ్యోతుల నెహ్రూ చేసిన విజ్ఞప్తులు ఇప్పుడు టీడీపీతో పాటు అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి. అదే సమయంలో ఆయన ఎంచుకున్న మార్గం కూడా చర్చనీయాంశమైంది.

jyothulanehru

టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తన సెల్ఫీ వీడియోలో చేసిన రెండు విజ్ఞప్తుల్లో ఒకటి పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ గురించి. పిఠాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎవరిని పోటీకి అవకాశం ఇచ్చినా గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పటికే పిఠాపురం టికెట్ పై టీడీపీలో పోటీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం పలువురు ఆశావహులు ప్రయత్నిస్తున్నా వారిలో ఎవరికి టికెట్ దక్కినా మద్దతివ్వాలని జ్యోతుల నెహ్రూ కోరారు.

అలాగే రెండో విజ్ఞప్తి కాకినాడ ఎంపీ సీటు గురించి. కాకినాడ ఎంపీ సీటులో తన కుమారుడు జ్యోతుల నెహ్రూకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరమని జ్యోతుల నెహ్రూ తన సెల్ఫీ వీడియోలో పార్టీ నేతల్ని కోరారు. కాకినాడ ఎంపీ సీటులో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఉన్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ ఎంపీ సీటులో తమకు అవకాశాలు ఉంటాయని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ స్ధానంలో తన కుమారుడు, ప్రస్తుతం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నవీన్ కు అవకాశం ఇచ్చేలా నెహ్రూ ఒత్తిడి పెంచుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+