డిప్యూటీ సీఎంగా లోకేష్ ? టీడీపీ నేత షాకింగ్ వీడియో..!
ఏపీలో ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా ? జనసేనాని పవన్ కళ్యాణ్ కు పోటీగా లోకేష్ ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా చంద్రబాబు డిప్యూటీ సీఎం చేయబోతున్నారా ? ఇప్పటికే టీడీపీలో సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కు ఇక డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ఒక్కటే మిగిలుందా ? ఈ మేరకు పార్టీ అధిష్టానం కింది స్దాయి నేతల్లోకి ఈ చర్చను పంపిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వారసత్వం కారణంగా అందలం ఎక్కించడం ఎంత తప్పో, వారసత్వాన్ని కారణంగా చూపి అవకాశాలు కల్పించకపోవడం కూడా అంతే తప్పు అంటూ టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించే అంటూ ఆయన స్పష్టంగానే చెప్పేశారు. యూట్యూబ్ లో వీడియోలతో హల్ చల్ చేసే మహాసేన రాజేష్.. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే అనే చర్చను తెరపైకి తెచ్చారు.

కూటమి భేటీల్లో ఎమ్మెల్యేలతో పాటు లోకేష్ ఎక్కడో కూర్చుకుంటున్నారని, తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ నారా లోకేష్ ను అనుకోకుండా నెట్టేస్తున్న వీడియో చూసి తనకు బాదేసిందని మహాసేన రాజేష్ చెప్పుకొచ్చారు. గతంలో తాను టీడీపీ భవిష్యత్తు దృష్ట్యా లోకేష్ ను సీఎంను చేయాలని కూడా తాను కోరినట్లు వెల్లడించారు. టీడీపీ అంటే పొలిట్ బ్యూరోయేనని, అందులో సభ్యులకు రాజేష్ ఓ ప్రశ్న వేశారు. లోకేష్ ను ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా తిప్పి ప్రచారం చేయించుకున్నారని గుర్తుచేశారు. అప్పట్లో లోకేష్ ను అలా వాడుకుని ఇప్పుడు కీలక పదవి ఇవ్వకపోవడం తప్పన్నారు.
నారా లోకేష్ చంద్రబాబు తనయుడన్న కారణం చూపి ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం సరికాదని మహాసేన రాజేష్ తెలిపారు. అలా కాకుండా అందరు మంత్రులతో సమానంగా లోకేష్ ను చూడలేమని, గతంలో ఆయన పార్టీ కోసం చేసిన సేవను గుర్తించి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే లోకేష్ ను చూసి పార్టీలోకి వచ్చిన తమ లాంటి వారికి కష్టంగా ఉందన్నారు. చంద్రబాబు ఎవరో ఏదో అనుకుంటారని భావిస్తారని, కానీ భవిష్యత్తులో ప్రజలకు లోకేష్ ఏ పదవిలో ఉన్నాడనేది గుర్తుంటుందన్నారు. చంద్రబాబుతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు ఆలోచించి లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రకటించాలన్నారు. గతంలో సోనియా, రాహుల్ ప్రధాని పదవి తీసుకోకుండా దూరంగా ఉండటం వల్లే ఇప్పుడు ఆ పార్టీకి ఈ పరిస్ధితి వచ్చిందన్నారు. దాన్నే ఉదాహరణగా తీసుకుని లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications