Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సత్యకుమార్ వెనుక నేనున్నా- గెలిపించి చూపిస్తా- పరిటాల శ్రీరామ్ సవాల్..!

ఏపీలో ఎన్నికల వేళ జట్టు కట్టిన ఎన్డీయే పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లూ పొత్తులపై మౌనంగా ఉంటూ వచ్చిన బీజేపీ.. చివరి నిమిషంలో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అప్పటికే టీడీపీ, జనసేన కష్టపడిన నియోజకవర్గాల్ని తన్నుకుపోయింది. దీనిపై చాలా చోట్ల ఇరు పార్టీల నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. రాయలసీమలోని ధర్మవరం సీటులో మాత్రం సర్దుకుపోయేందుకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సిద్ధమయ్యారు.

ధర్మవరం నుంచి టికెట్ ఆశించి, పొత్తు కారణంగా కోల్పోయిన టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఇవాళ ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పారు. ధర్మవరంలో టీడీపీ సింబల్ మాత్రమే లేదని, మిగిలినదంతా సేమ్ టు సేమ్ అన్నారు. టికెట్ రానంత మాత్రాన పారిపోయే వ్యక్తిని కాదన్నారు. కొందరిలాగా ఓటమి తర్వాత కార్యకర్తలను వదిలేసే టైపు కాదన్నారు. ధర్మవరం సీటు వదులుకోవడంపై స్పందిస్తూ.. త్యాగం మాటల్లోనే కాదు..చేతల్లో కూడా చూపించామన్నారు.

tdp leader paritala sriram interesting comments on dharmavaram bjp candidate satya kumar

కష్టం వచ్చినా నష్టం వచ్చినా.. తన ప్రయాణం ధర్మవరంలోనే అని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఐదేళ్ల క్రితం శ్రీరామ్ వేరు.. ఇప్పుడు శ్రీరామ్ వేరన్నారు. ధర్మవరంలో ప్రతి కార్యకర్త ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ని గెలిపించాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఇప్పటికే ధర్మవరం పేరు ఢిల్లీలో వినిపించిందన్నారు. ఎన్నికల తర్వాత అది మారుమ్రోగాలని పరిటాల వారసుడు కోరారు. సత్యకుమార్ వెనుక శ్రీరామ్ ఉన్నాడని వైసిపి నాయకులకు గట్టిగా హెచ్చరించి చెప్పాలని టీడీపీ నాయకులకు పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+