ప్రశాంత్ కిషోర్ టీమ్స్ గెలిచాయి : దీదీ వీరనారి, స్టాలిన్ సీఎం : టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
దేశంలో నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగగా,ఈరోజు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళ నాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే విజయాలు దాదాపుగా ఖరారయ్యాయి.ఇక అదే విధంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసే దిశగా బీజేపీకి అందనంత దూరంగా దూసుకుపోయింది.ఈ రెండు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు.

పీకే రాజకీయ చతురత వల్లే పశ్చిమ బెంగాల్ విజయం
పీకే రాజకీయ చతురత వల్లే ఈ రెండు పార్టీలు విజయం సాధించాయని దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. బెంగాల్, తమిళనాడులలో ప్రశాంత్ కిషోర్ టీమ్స్ గెలిచాయని వెల్లడించారు. మమతా బెనర్జీని బీజేపీ ఎంత టార్గెట్ చేసిన, ప్రశాంత్ కిషోర్ ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే ఆమె వీరనారిగా గెలిచారు అని వ్యాఖ్యానించారు.

తమిళనాడులోనూ పీకే స్ట్రాటజీ లే పని చేశాయి
తమిళనాడు రాష్ట్రంలోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై సాధించాయని,స్టాలిన్ ను సీఎంగా చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తమిళనాడులోనూ పీకే స్ట్రాటజీనే పైచేయి సాధించిందని పేర్కొన్నారు .మొత్తంగా పీకే వ్యూహాలే విజేతలయ్యాయి. మొత్తంగా అటు స్టాలిన్ ను ,ఇటు మమతా బెనర్జీని ప్రశాంత్ కిషోర్ గెలిపించారని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.తాజా ఎన్నికల ఫలితాల నేపధ్యంలో బెంగాల్ పోరులో బీజేపీని పీకే నిలవరించిన తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.

ఎన్నికల వ్యూహకర్తపై దేశం దృష్టి .. సంచలన నిర్ణయం తీసుకున్న పీకే
ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల వ్యక్తి ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు . పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా దాటదని పలుమార్లు సవాల్ చేసిన పీకే ప్రస్తుతం వ్యూహకర్త పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. చేయగలిగినంత చేశాను బెంగాల్ గెలిచిందని పేర్కొన్న ఆయన ప్రస్తుతం కొంత కాలం బ్రేక్ తీసుకొని ఇంకేమైనా చేయాలనుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు .
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications