బుచ్చయ్యతో టీడీపీ సంప్రదింపులు -చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఫోన్- ఊహాగానాలేనంటూ..
పార్టీ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఎమ్మెల్యే పదవికీ, పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరిని నేతలు బుజ్జగిస్తున్నారు. పార్టీపై అసంతృప్తి నేపథ్యంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ ఛీఫ్ అచ్చెన్నాయుడు కూడా ఆయనతో పోన్ లో మాట్లాడారు.
ఎమ్మెల్యే పదవికీ, పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఆయన్ను పార్టీకి చెందిన జిల్లా నేతలు పలువురు పరామర్శించారు. పార్టీని వీడొద్దంటూ కోరారు. కష్టకాలంలో పార్టీని వీడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన కాస్త మెత్తపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ఠ్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఫోన్ చేయడంతో బుచ్చయ్య శాంతించినట్లు తెలుస్తోంది.

గోరంట్లను ఆయన ఇంట్లో అనవర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలకరించారు. గోరంట్లతో మాట్లాడామని, ఆయన రాజీనామా చేయబోవడం లేదని రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీలో గోరంట్లకు ఉన్న అంతర్గత సమస్యలు పరిష్కారం చేసుకుంటామని ఆయన తెలిపారు. గోరంట్ల పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సుశిక్షితుడైన నేత అని ఆయన కితాబిచ్చారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు గోరంట్లతో ఇప్పటికే మాట్లాడారని, రాజీనామా యోచనలో ఉన్న గోరంట్లతో ఫోన్ లో
ముఖ్యనాయకులు సంప్రదింపులు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మరోవైపు రాజమండ్రిలో గోరంట్ల
నివాసం వద్దకు ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. గోరంట్లకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ హవాలోని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ కూ ఫోన్లు చేసినా ఎత్తడం లేదంటున్నారు. కానీ పీఏసీ ఛైర్మన్ పదవిని ఆయనకు ఇస్తారని భావించినా చంద్రబాబు పయ్వావుల కేశవ్ వైపే మొగ్గు చూపడంతో గోరంట్ల రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.
Recommended Video
బుచ్చయ్యతో టీడీపీ సంప్రదింపులు -చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఫోన్- ఊహాగానాలేనంటూ..#andhrapradesh, #TDP , #butchaiahchowdary pic.twitter.com/7GDxUE8EkT
— oneindiatelugu (@oneindiatelugu) August 19, 2021
-
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications