Viral Video: జగన్ ఇంటి ముందు లోకేష్ బర్త్ డే- రచ్చ చూసి తీరాాల్సిందే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ పై రగిలిపోతున్న టీడీపీ క్యాడర్ ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన ఇంటి ముందు హంగామా సృష్టించింది. కార్లు, బైక్ లపై వచ్చిన టీడీపీ కార్యకర్తలు హారన్లు మోగిస్తూ, నారా లోకేష్ జెండాలు పట్టుకుని నానా హంగామా చేశారు. ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉండటంతో ఆయన కార్యాలయ సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేసినా వినలేదు. కాసేపు హంగామా చేశాక వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

tdp leaders Hungama infront of ys jagan s house on nara Lokesh birthday

ఇవాళ మధ్యాహ్నం మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్న టీడీపీ కార్యకర్తలు అనంతరం రోడ్లపైకి వచ్చారు. బైక్ లతో తాడేపల్లి అంతా కలియ తిరిగారు. ఈ సమయంలోనే తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇల్లు ఉన్న రోడ్డుపైకి వచ్చారు. ప్రస్తుతం జగన్ ఇంటి ప్రాంగణంలోనే వైసీపీ రాష్ట్ర కార్యాలయం కూడా నడుస్తోంది. దీంతో ఈ కార్యాలయం బయట రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు కార్లు, బైక్ లు ఆపి రచ్చ మొదలుపెట్టారు.

జగన్ ఇంట్లో లేకపోయినా ఆయన ఇంటి ముందు లోకేష్ బ్లానర్లు పట్టుకుని, కార్లు ఎక్కి, బైక్ ల హారన్లు మోగిస్తూ టీడీపీ కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. వీరిని వారించేందుకు జగన్ కార్యాలయ భద్రతా సిబ్బంది ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో జగన్ భద్రతా సిబ్బంది వీరిని ఫోన్లలో వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అయినా వారు పట్టించుకోకుండా కాసేపు హంగామా సృష్టించారు. చివరికి వీడియోలు తీస్తున్న విషయం గమనించి అక్కడి నుంచి జారుకున్నారు.

వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డును విస్తరించడంతో పాటు ఆంక్షలు కూడా పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్రమంగా ఈ ఆంక్షల్ని తొలగించేసింది. దీంతో జగన్ ఇంటి ముందు రోడ్డుపై వాహనాలు ఇప్పుడు యథావిథిగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే క్రమంలో తమకు ఎప్పటి నుంచో టార్గెట్ గా ఉన్న జగన్ ఇంటి వద్ద లోకేష్ బర్త్ డే సందర్భంగా టీడీపీ కార్యకర్తలు హంగామా చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+