కుప్పం ఎన్ టీఆర్ సర్కిల్ లోకి నో ఎంట్రీ, టీడీపీ ఏం చేసిందంటే ?, మాకు టైమ్ వస్తుంది !

కుప్పం/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని కుప్పంలో టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న నారా చంద్రబాబు నాయకుడు ఇప్పటికే మూడు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

TDP leaders protesting at a private place in Kuppam.

కుప్పంలోని టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్టును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిరాదీక్షలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. కుప్పం పట్టణంలోని ఎన్ టీఆర్ విగ్రహం ఎదుట నిరసన వేదిక ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరాహారదీక్షలు చేపట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ బంద్ రోజు, మరుసటి రోజు ఎన్ టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకలు దీక్షలు చెయ్యడానికి అనుమతి ఇచ్చారు.

తరువాత ఎన్ టీఆర్ విగ్రహం ఎదురుగా ఉన్న దీక్షా శిభిరాన్ని పోలీసులు బలవంతంగా తొలగించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో దీక్షలు చెయ్యడానికి అవకాశం లేదని పోలీసులు టీడీపీ నాయకులకు తేల్చి చెప్పారు. పలమనేరు డీఎస్పీని అనుమతి అడిగినా అందుకు ఆయన నిరాకరించారని టీడీపీ నాయకులు అంటున్నారు.

TDP leaders protesting at a private place in Kuppam.

కుప్పం పట్టణంలో ప్రభుత్వ స్థలంలో ఎక్కడా నిరాహార దీక్షలు చెయ్యడానికి అనుమతి ఇవ్వమని పోలీసులు తేల్చి చెప్పారని టీడీపీ నాయకులు అంటున్నారు. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిలోని టీడీపీ కార్యాలయం సమీపంలోని ప్రైవేట్ స్థలాన్ని చదును చేసిన టీడీపీ నాయకులు అక్కడ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి నిరాహారదీక్షలు చేస్తున్నారు.

వైకాపా నాయకులు కావాలనే నిరాహారదీక్షలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారని కుప్పం నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పీఎస్ మునిరత్నం ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు ప్రజలు సరైన సమయంలో వైసీపీ ప్రభుత్వానికి తగినగుణపాఠం చెబుతారని, అంతకాలం తాము ఓపికగా ఎదురు చూస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+