Kolikapudi Srinivas: మరో వివాదంలో కొలికపూడి-ఈసారి మహిళలపై వేధింపులు.. !

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన దురుసు ప్రవర్తన కారణంగా స్థానికంగా టీడీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పార్టీ నేతలు, రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు ఇలా ఎవరినీ వదలకుండా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఆయన్ను వివాదాలు మాత్రం వీడటం లేదు.

తిరువూరు మండలం చిట్టేల గ్రామానికి చెందిన మహిళలు ఇవాళ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై సంచలన ఆరోపణలు చేశారు. కొలికపూడి తమపై అసభ్యంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు. పోన్ చేసి ఒంటరిగా రమ్మంటున్నారని, ఫోన్లకు అసభ్య సందేశాలు పంపుతున్నారని తెలిపారు. తమపై ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అప్పటివరకూ తాము ఉద్యమం చేపడతామన్నారు.

tdp mla kolikapudi Srinivasa rao lands in another row harassment against women

తిరువూరులో కొలికపూడి అరాచకాలను భరించలేకపోతున్నామని మహిళలు ఆరోపించారు. ఏ ఊరికి వెళ్లినా, ఎక్కడికెళ్లినా కొలికపూడి మహిళలతో దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబును చూసి తాము టీడీపీకి ఓట్లేశామని, కానీ ఇప్పుడు కొలికపూడి వేధింపులను భరించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు వెంటనే స్పందించి కొలికపూడి శ్రీనివాసరావును వెంటనే నియోజకవర్గం నుంచి తప్పించాలని, లేకుంటే తాము ఆత్మహత్యలకు పాల్పడతామని మహిళలు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+