బాలయ్య ఉగ్రావతారం- ఒక్క చిటికేస్తే చాలు: వైసీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్..

నరసరావుపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. మూర్ఖుడిగా అభివర్ణించారు.

అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఉగ్రావతారం ఎత్తారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను మూర్ఖుడిగా అభివర్ణించారు. యథా రాజ తథా ప్రజ అన్నట్లు వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. సినిమాలను సినిమాలుగా మాత్రమే చూడాలని సూచించారు.

నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఇటీవలే ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇందులో భాస్కర్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త నందమూరి బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని పాటను ప్లే చేశారు. ఇది గోపిరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. బాలకృష్ణ పాట వేయొద్దంటూ ఆదేశించారు. దాన్ని తొలగించాలని సూచించారు. ఇది బాలకృష్ణ దృష్ికి వెళ్లింది.

TDP MLA Nandamuri Balakrishna lashes out at ruling YSRCPs MLA Gopireddy Srinivasa Reddy

దీనిపై ఆయన స్పందించారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సినిమాలను సినిమాగా చూడాలని సూచించారు. ఇందులో రాజకీయాలను జొప్పించకూడదని అన్నారు. సినిమా అనేది ఏ కులానికో, మతానికో సంబంధించినది కాదని చెప్పారు. సినిమాలను అందరూ చూస్తారని, అన్ని కులాలవారు, మతాలవారిని ఒకేచోటికి చేర్చే శక్తి సినిమాకు ఉందని పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని సినిమా ప్రపంచం ఏకం చేస్తుందని వ్యాఖ్యానించారు.

అలాంటి సినిమాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ అన్నారు. తాను ఒక్క చిటికె వేస్తే చాలని హెచ్చరించారు. పెద్ద చదువులు చదివానని, ప్రజా సేవ చేస్తోన్నానని చెప్పుకొంటోన్నాడు.. చేసుకో. ఒక్కసారి నేను మూడోకన్ను తెరిచానో.. మామూలుగా ఉండదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చెప్పారు. తన సినిమా పాటలను తీసేయాలనేంత నీచానికి దిగజారడం సరికాదని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని అన్నారు.

TDP MLA Nandamuri Balakrishna lashes out at ruling YSRCPs MLA Gopireddy Srinivasa Reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+