Raghurama: కొత్త పాత్రలోకి రఘురామ-ఏకగ్రీవంగా ఎన్నిక..!
టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇవాళ కొత్త పాత్రలోకి అడుగుపెట్టారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసి, తాజా ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘురామరాజును డిప్యూటీ స్పీకర్ గా ప్రభుత్వం ఎంపిక చేసింది.దీంతో ఆయన పేరుతో నిన్న మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రఘురామకు పోటీగా ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు.
నరసాపురానికి చెందిన రఘురామకృష్ణంరాజు తొలిసారి 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ప్రభుత్వంతో, అప్పటి సీఎం జగన్ తో విభేదించి విమర్శలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం అప్పట్లో రాజద్రోహం కేసు కూడా పెట్టింది. అనంతరం పోలీసులు అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారు. అనంతరం దీనిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. చివరికి ఎంపీగా ఉంటూ ఐదేళ్ల పాటు నియోజకవర్గానికి సైతం దూరమయ్యారు.

ఈ క్రమంలో కూటమికి దగ్గరైన రఘురామకృష్ణంరాజుకు ఎంపీ టికెట్ లభిస్తుందని భావించినా అలా జరగలేదు. చివర్లో టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని గెలిచారు. అనంతరం ప్రభుత్వంలో కీలక పదవి ఉంటుందని భావించారు. అదీ జరగలేదు. చివరికి స్పీకర్ పదవి అయినా దక్కుతుందని ఆశించినా అవకాశం రాలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. దీంతో ఆయన తొలిసారి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications