చిక్కుల్లో మరో టీడీపీ ఎంపీ? మరో వైసీపీ ఫేవరెట్ స్టార్ కు సాయం చేసి..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి కక్ష తీర్చుకుంటుందని ఆశించిన క్యాడర్ కు నేతలు వరుసగా షాకులిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ అనుకూల సింగర్ మంగ్లీని తీసుకుని అరసవిల్లి సూర్యదేవాలయానికి వెళ్లి సంచలనం రేపగా.. తాజాగా మరో టీడీపీ ఎంపీ ఇలాగే జగన్ కు సన్నిహితుడైన ఓ టాలీవుడ్ స్టార్ కు సాయం చేసి చిక్కుల్లో పడ్డారు.
తాజాగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గత ఐదేళ్లుగా వైసీపీతో అంటకాగిన టాలీవుడ్ సింగర్ మంగ్లీని వెంటబెట్టుకుని అరసవిల్లి సూర్యదేవాలయానికి వెళ్లారు. దీంతో టీడీపీ కోసం గత ఐదేళ్లుగా తాము వైసీపీతో పోరాటాలు చేస్తే ఇప్పుడు ఆ పార్టీకి అనుకూలమైన సింగర్ ను వెంటబెట్టుకుని సూర్యదేవాలయానికి వెళ్లడం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో రామ్మోహన్ నాయుడు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనిపై ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియక మౌనంగా ఉండిపోయారు. ఈ తరుణంలో పార్టీ పెద్దలు కూడా మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తాజాగా హీరో నాగార్జున కుటుంబాన్ని తీసుకుని ప్రధాని మోడీ వద్దకు వెళ్లారు. హీరో నాగచైతన్య, ఆయన భార్య శోభిత ధూళిపాళ్లతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులందరినీ తీసుకుని లావు కృష్ణదేవరాయలు ఇలా ప్రధాని మోడీ వద్దకు వెళ్లడం వివాదాస్పదమైంది. నాగార్జునకు వైసీపీ అధినేత జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇక్కడ రెండు విషయాలు...
— Swathi Reddy (@Swathireddytdp) February 8, 2025
1. ఆ నాగార్జున చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు గౌరవం ఇచ్చింది లేదు. అలాంటి వ్యక్తిని దగ్గరుండి మోడీ వద్దకు తీసుకెళ్లడం లావు గారు చేసిన మొదటి తప్పు
2. నాగార్జున ని తీసుకెళ్తున్న విషయం కనీసం పార్టీకి సమాచారం ఇవ్వకపోవడం రెండో తప్పు.
ప్రక్క… pic.twitter.com/iDjjriBKTR
గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు, అంతకు ముందు జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్ ను నాగార్జున పదే పదే కలిసేవారు. అలాంటి వ్యక్తిని ఫ్యామిలీతో సహా ప్రధాని మోడీ వద్దకు టీడీపీ ఎంపీ తీసుకెళ్లడం ఏంటనే చర్చ జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications