రాజీనామా చేద్దాం-కలిసే సాధిద్దాం, ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేస్తే..: బాబుకు జగన్ సవాల్

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంత దుర్మార్గమైన పాలనను తాను ఎక్కడా చూడలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్ర 88వ రోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లాలోని రేణమాలలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి సమావేశంలో ఆయన ప్రసంగించారు.

నాకు భయమా? మన మేలు కోసమే పవన్, జగన్ మాత్రం..: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ ఆరోపించారు. మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ప్యాకేజీకి అందుకే ఒప్పుకున్నా! పార్టీ నేతలపై ఆగ్రహం-ఎంపీలకు ప్రశంస: తేల్చేసిన చంద్రబాబు

 ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేసివుంటే..

ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేసివుంటే..

దళిత మహిళను బట్టలూడదీసి కొట్టినా ఈ టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి నుంచి పుత్తూరు వరకు మహిళలపై దాడులు జరిగినా నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వోపై టీడీపీ ఎమ్మెల్యే(చింతమనేని ప్రభాకర్) దాడి చేసి జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లినప్పుడే.. అతడ్ని ఎన్‌కౌంటర్ చేయాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాజరిగివుంటే ఇప్పుడు మహిళలపై దాడులు జరిగేవి కావని అన్నారు. మద్యం షాపులు గ్రామ గ్రామాన పెట్టి మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

 అప్పులన్నీ తీర్చేస్తాం

అప్పులన్నీ తీర్చేస్తాం

పొదుపు సంఘాలు రుణాలు మాఫీ చేస్తామని, వడ్డీ కూడా కట్టడం లేదని చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. దీంతో మహిళలకు రుణాలు కూడా రావడం లేదని జగన్ ఆరోపించారు. బాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. దేవుడి ఆశీర్వాదం, మీ మద్దతుతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల భద్రతకే అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పొదుపు సంఘాల్లో ఉన్న అప్పులన్నీ నాలుగు దఫాలుగా తీర్చేస్తామని జగన్ తెలిపారు.

 నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి..

నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి..

ఇక ఈ ప్రభుత్వం కారణంగా విద్యార్థులు పడే బాధలు చూస్తే తన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని జగన్ అన్నారు. వైయస్సార్ ప్రజల కోసం ఒక్క అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తానని చెప్పారు. ఎన్ని లక్షలైనా సరే పిల్లలందర్నీ ఉన్నత చదువులు చదివిస్తానని అన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.20వేలు ఇస్తామని చెప్పారు. అంతేగాక, పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి రూ. 15అందజేస్తామని చెప్పారు.

ఇవన్నీ చేసి చూపిస్తాం

ఇవన్నీ చేసి చూపిస్తాం

రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని జగన్ తెలిపారు. అక్కాచెల్లెమ్మల పేరు మీద ఈ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. ఒకవేళ డబ్బులు అవసరమైతే బ్యాంకుల్లో ఇంటిని తాకట్టు పెట్టి.. పావలా వడ్డీకే రుణాలు పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక అవ్వతాతలకు రూ.2వేల పెన్షన్లు ఇస్తామని చెప్పారు. అంతేకాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు 45ఏళ్లకే పెన్షన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. మద్యం షాపులను మూడు దఫాలుగా పూర్తిగా బంద్ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. 2024వరకు పూర్తి స్థాయిలో మద్యం లేకుండా చేస్తామని తెలిపారు.

మాతో కలిసి రండి.. చంద్రబాబుకు సవాల్

మాతో కలిసి రండి.. చంద్రబాబుకు సవాల్

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ తమతో కలిసి రావాలని జగన్ పిలుపునిచ్చారు. హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, చంద్రబాబు కూడా వారి పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. 25మంది ఎంపీలు ఒక్కసారిగా రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందని, ఇక ప్రత్యేక హోదా ఎక్కడికి పోతుందో చూద్దామని జగన్ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP President YS Jaganmohan Reddy on Thursday said that TDP MPs also should resign with his party MPs for special status.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి