లైంగిక వేధింపులు: టీచర్‌ను వెంబడించి చితకబాదారు

విద్యార్థినులు విషయాన్ని పెద్దలకు చెప్పడంతో తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్‌కి ఫిర్యాదు చేశారు. స్పందించిన సర్పంచ్ భర్త తల్లిదండ్రులతో బుధవారం పాఠశాలకు వెళ్ళి సదరు ఉపాధ్యాయుడుని నిలదీశారు. ఉపాధ్యాయుడు ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర రావు తెలిపారు.
కాగా, సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు కోరుతూ విద్యార్థులు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు రామకృష్ణను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications