ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలలో సమస్యలు- ఆందోళనలో విద్యార్ధులు, తల్లితండ్రులు...

ఏపీలో ఇంటర్ మీడియట్ ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలు విడుదల చేసినా ప్రభుత్వం ఇచ్చిన వెబ్ సైట్లతో పాటు ప్రైవేటు సైట్లలోనూ ఫలితాలు అప్ లోడ్ కాలేదు. దీంతో విద్యార్ధులు, తల్లితండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఏపీలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసే విషయంలో విద్యాశాఖ ఈసారి పద్ధతి మార్చింది. కరోనా కారణంగా సీడీల్లో ఫలితాలను విడుదల చేసే బదులు నేరుగా వెబ్ సైట్లకు తామే అప్ లోడ్ చేసేలా మార్పులు చేసింది.

technical issues in release of ap intermediate results

ఈ ప్రయోగం బెడిసి కొట్టిందని తాజాగా ఫలితాల ఆలస్యాన్ని బట్టి అర్దమవుతోంది. ఫలితాలు నాలుగు గంటలకే విడుదలైనా సాయంత్రం ఆరుగంటలు దాటినా అవి వెబ్ సైట్లలో అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్ధులతో పాటు తల్లితండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. అధికారులు సాంకేతిక సమస్యలు చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+