నాకు ఏపాపం తెలీదు, నటి బాగా నటిస్తోంది రా సామి ?, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ !
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో మొదట ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రేవ్ పార్టీ నిర్వహించిన ఐదు మంది ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో తెలుగు నటి హేమాకు ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పుడు మరో తెలుగు నటి మీద బెంగళూరు పోలీసులు నిఘా వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు నగర శివార్లలోని అనేకల్ తాలుకాలోని హుస్కూరు సమీపంలోని జేఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం గురించి రోజుకొక వ్యవహారం బయటకు వస్తోందిది. రేవ్ పార్టీ జరగడంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత రేవ్ పార్టీ కేసును బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హెబ్బగుడి పోలీసులకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు.

ఎప్పుడు అయితే తెలుగు నటి హేమా, శ్యాండిల్ వుడ్ నటీ, నటీనటులు, కొందరు తెలుగు నటీమణులు రేవ్ పార్టీలో ఉన్నారని వెలుగు చూడటంతో తరువాత కేసు బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు బెంగళూరు సీసీబీ పోలీసులు రేవ్ పార్టీ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు నటి హేమాతో పాటు మరో తెలుగు నటి ఆషి రాయ్ కూడా పాల్గొందని బెంగళూరు పోలీసులు నిర్దారించారు.
తెలుగు నటి ఆషి రాయ్ మాత్రం తాను ఆ పార్టీకి హాజరైనానని అంటోంది. అయితే అది బర్త్ డే పార్టీ అని తనను ఆహ్వానించారని, వాసు తనకు అన్నలాంటి వాడు అని, కేక్ కట్ చేసిన తరువాత తాను ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశానని, తరువాత అక్కడ ఏం జరిగిందో తనకు తెలీదని నటి ఆషి రాయ్ అంటోంది. రేవ్ పార్టీ అంటే ఏమిటో తనకు తెలీదని ఆషి రాయ్ చెబుతోంది. నటి హేమా ఆ పార్టీకి హాజరు అయ్యిందా ? లేదా ? అని కూడా తనకు తెలీదని ఆషి రాయ్ అంటోంది.

అయితే బర్త్ డే పార్టీ అంటే హైదరాబాద్ నుంచి ఎవరైనా ఎగేసుకుంటూ వస్తారా ? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆషి రాయ్ బ్లడ్ శ్యాంపిల్స్ ను పోలీసులు సేకరించి ల్యాబరోటరీకి పంపించారని, రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనారని వెలుగు చూడటంతో బెంగళూరుతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications