లేడీ ఎన్యుమరేటర్‌పై టిడిపి నేత బూతులు: కేసు

సోమవారంనాడు ప్రీ సర్వే నిర్వహించడానికి వచ్చిన మహిళా అధికారితో రాజు నాయుడు అనే టిడిపి నేత వాదనకు దిగడమే కాకుండా ఆమెను బూతులు తిట్టాడని, ఆమె ప్రైవేట్ భాగాలను తాకాడని ఆరోపణలు వచ్చాయి. అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు
అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బి ఫార్మసీ విద్యార్థిని ప్రీ సర్వేలో భాగంగా ఇళ్లకు స్టిక్కర్లు అతికించడం, సర్వే ఫారాలను పంపిణీ చేయడం వంటి పనులు చేస్తూ ఉండగా రాజు నాయుడు గొడవకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
సుల్తానా అనే ఆ మహిళా ఎన్యుమరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజు నాయుడిపై కేసు నమోదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టులు మాత్రం చేయలేదు.












Click it and Unblock the Notifications