సానియా స్థానికతేమిటి: కెసిఆర్‌పై తెలుగు యువత
హైదరాబాద్: స్థానికత విషయంలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంగతి ఏమిటని తెలుగు యువత ప్రశ్నించింది.1956కు ముందే తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ , సంక్షేమ పథకాలు అందుతాయని పదే పదే కెసిఆర్ చెబుతున్నారని ఆయనకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా విషయంలో ఈ నిబంధనలు గుర్తుకురాలేదా అని తెలుగుయువత కార్యనిర్వాహణ కార్యదర్శి జిమ్మిబాబు ప్రశ్నించారు.
ఆమె తాతముత్తాతలు తెలంగాణకు చెందిన వారా అని ఫ్రశ్నించారు. సానియా మీర్జా తండ్రి తెలంగాణకు చెందిన వారు కాదని, ఆమె భర్త వేరే దేశానికి చెందిన వారని అలాంటిది ఆమెకు ఆఘమేఘాల మీద కోటి రూపాయిలు నిధులు ఏ విధంగా కేటాయించారని ప్రశ్నించారు.

పిల్లలు చదువుకుంటామంటే డబ్బులు ఇవ్వరుకాని సొంతంగా అకాడమి పెట్టుకుని వ్యాపారం చేసుకునే వారికి ఏ మొహం పెట్టుకుని నిధులు కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. 1947కు ముందు తెలంగాణ ప్రత్యేక దేశమని ఎంపి కవిత చెబుతుండగా, ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లు పనికి రాలేదా అని ప్రశ్నిచారు. తెలుగుయువత తెలుగుదేశం అనుబంధ విద్యార్థి సంఘం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications