చంద్రబాబునాయుడు ''గ్లోకల్ లీడరా?''
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక విజన్ ఉన్న నేతగా గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నా, లేకపోయినా ఒక ''గ్లోకల్ లీడర్''గా రూపాంతరం చెందారు. గతంలో ఆయనపై ''విజన్-2020'' పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. ఇప్పుడు తాజాగా ''గ్లోకల్ లీడర్'' పేరుతో ప్రపంచ ప్రఖ్యాత బ్రిటీష్ ముద్రణ సంస్థ ''బ్లూమ్స్ బెరి'' సంస్థ పుస్తకాన్ని ముద్రించింది. తెలుగు యువ రచయిత్రి పగడాల తేజస్విని చంద్రబాబు వ్యక్తిత్వంపై పరిశోధన చేసి ''గ్లోకల్ లీడర్'' పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. దాన్ని ''బ్లూమ్స్ బెరి'' ప్రచురించడంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా అందరూ బాబును చూస్తే భవిష్యత్తు దార్శనికుడు కనిపిస్తాడు. కాలానికి అనుగుణంగా చోటుచేసుకోబోతున్న మార్పులపై ఆయన తీసుకునే నిర్ణయాలు అందరినీ అచ్చెరువొందేలా చేస్తాయి. అటువంటి వ్యక్తి మనస్తత్వాన్ని ఒక యువ రచయిత్రి పరిశోధన చేయడమే కాకుండా పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది. ''గ్లోకల్ లీడర్'' పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అన్ని పుస్తక విక్రయశాలలో అందుబాటులోకి వచ్చింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడంతోపాటు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపారు. ఈ విషయాన్ని రచయిత్రి పుస్తకంలో ప్రశంసించారు. స్థానికంగా అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించడంవంటి రెండు పనులను ఏకకాలంలో ఏయడంద్వారా చంద్రబాబునాయుడు ''గ్లోబల్ లీడర్'' ప్లస్ ''లోకల్ లీడర్'' కలిపి ''గ్లోకల్ లీడర్''గా ఎదిగారంటూ రచయిత్రి చక్కగా విశ్లేషించారు.












Click it and Unblock the Notifications