ఏపీలోనే లేదు, ఇలా తెచ్చారు: రూ.3.60 కోట్ల కారును కొడుక్కు గిఫ్ట్‌గా ఇచ్చిన జేసీ
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి రూ.3.60 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారును బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి రూ.3.60 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారును బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇలాంటి కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని చెప్పారు. ఇటలీలో తయారైన ల్యాంబోగిని మెడల్‌కు చెందిన ఈ కారును ముంబై వరకు నౌకలో, అక్కడి నుంచి కంటెయినర్‌లో తాడిపత్రికి తెప్పించారు.

తన చిరకాల కోరిక మేరకు దీనిని కొన్నానని, అయితే నడిపేందుకు తన వయసు సహకరించదు కాబట్టి తన ముచ్చటను కొడుకు ద్వారా తీర్చుకుంటున్నట్లు చెప్పారు. రెండు సీట్ల సామర్థ్యం కలిగిన ఈ కారు గంటకు 320 కి.మీ. వేగంతో పయనిస్తుంది. లీటర్ పెట్రోలు మూడు కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అస్మిత్ రెడ్డి ఫ్యామిలీని ఎక్కించుకొని కారు నడిపారు.












Click it and Unblock the Notifications