పనులు వేగం: అన్ని హంగులతో సచివాలయం ఐదో బ్లాక్ సిద్ధం!

అమరావతి: రాజధాని ప్రాంతం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో అయిదో బ్లాక్ అన్ని హంగులతో సిద్ధమవుతోంది. మెట్లకు ఫినిషింగ్‌, లిఫ్టుల ఏర్పాటు, భవనానికి బయటి వైపు పెయింటింగ్స్‌ తప్ప, దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి.

ఇంటీరియల్‌ డెకరేషన పనులను కూలీలు రేయింబవుళ్లు షిఫ్టుల పద్ధతిలో చేస్తున్నారు. ఐదో బ్లాకు ప్రవేశ ద్వారానికి గ్లాసు డోర్లు అమర్చారు. కింది ఫ్లోర్‌లో ఎలక్ర్టికల్‌, నెట్‌, ఫైరు పనులు పూర్తయ్యాయి. ఆయా కార్యాలయాల ఉద్యోగులకు ఫర్నీచర్, చాంబర్లు దాదాపు సిద్ధం చేశారు.

Temporary secretariat fifth floor comlpeted

రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవ రావు ఈ నెల 21వ తేదీన చాంబర్‌ను ప్రారంభించే అవకాశముంది. తాత్కాలిక సచివాలయ భవనాలను మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌ మంగళవారం మంత్రి నారాయణతో కలసి మంగళవారం పరిశీలించారు.

అలాగే, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మంగళవారం తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల చాంబర్లను ఆయన పరిశీలించారు. మంత్రి నారాయణతో చర్చించారు. ఈ నెల 21న రెండు శాఖల కార్యాలయాలు ప్రారంభమవుతున్నాయని, ఉద్యోగులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మురళీకృష్ణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+