Tenali Assembly Election 2024 Results LIVE: తెనాలి అసెంబ్లీ ఎన్నికలు 2024 లైవ్ అప్డేట్స్
తెనాలి అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు: జనసేనలో నెంబర్ టూ నాదెండ్ల మనోహర్. పవన్ తరువాతి స్థానంలో ఉన్న మనోహర్ ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పవన్ కల్యాణ్ సైతం మనోహర్ గెలుపు కోసం బాధ్యత తీసుకున్నారు. పోలింగ్ రోజున తెనాలిలో చోటు చేసుకున్న పరిణామాలు మనోహర్ కు కలిసి వచ్చాయి. మనోహర్ గెలుస్తారనే అంచనాలు కనిపిస్తున్నాయి.
గెలుపు దిశగా మనోహర్
నాదెండ్ల మనోహర్ జనసేన లో కీలకంగా ఉన్నారు. టీడీపీ, జనసన మధ్య పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014,2019లో వరుసగా తెనాలి నుంచి ఓడిన మనోహర్ ఈ సారి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. జనసేన తొలి జాబితాలోనే మనోహర్ పేరు పవన్ ప్రకటించారు. తొలత టీడీపీ నేతల నుంచి సహకారం కనిపించకపోయినా..తరువాత పవన్ జోక్యంతో టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి పని చేసాయి. మనోహర్ కు మద్దతుగా చంద్రబాబు, పవన్ తెనాలిలో ప్రచారం చేసారు,. మనోహర్ ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

తెనాలి ప్రజలు తేల్చేసారా
తెనాలిలో సామాజిక సమీకరణాలకు మనోహర్ కు కలిసి వచ్చాయి. నియోజకవర్గంలో సామాజిక లెక్కలు..పార్టీల పొత్తు మనోహర్ కు మేలు చేసినట్లు కనిపిస్తోంది. అక్కడ వైసీపీ తిరిగి సిట్టింగ్ ఎమ్మల్యే అన్నాబత్తుని శివకుమార్ కు సీటు ప్రకటించింది. పోలింగ్ రోజున శివ కుమార్ ఒక ఓటరు పైన చేయి చేసుకోవటం..తిరిగి ఆ ఓటరు శివ కుమార్ పైన చేయి చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. ఇక్కడ టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి క్షేత్ర స్థాయిలో కలిసి పని చేయటం..ప్రచారం కలిసి వచ్చాయి. పోలింగ్ రోజున ఓటింగ్ సరళిలో ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనే సస్పెన్స్ నెలకొంది.
జిల్లాలో జనసేన తొలి సీటు
తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో తెనాలి నుంచి మనోహర్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెల్లడయ్యాయి. అయితే, వైసీపీ నేతలు మాత్రం పోలింగ్ సరళి పూర్తిగా తమకు అనకూలంగా కనిపించిందని విశ్లేషిస్తున్నారు. మెజార్టీ ఎలా ఉన్నా..తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, టీడీపీ కూటమి నేతలు మాత్రం తెనాలి లో తమ కూటమి అభ్యర్ది మనోహర్ గెలుస్తారని లెక్కలు చెబుతున్నారు. హోరా హోరీగా సాగిన పోలింగ్ తరువాత ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీనే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో...జూన్ 4న వెల్లడి కానున్న ఫలితం పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications