కుప్పంలో టెన్షన్... చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను అడ్డుకున్న వైసీపీ నేతలు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలో వైసీపీ 9నెలల పాలనపై ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. చంద్రబాబు వైసీపీ 9నెలల పాలనలో 9 రద్దులు, మోసాలు, భారాలను ప్రజలకు చెప్పాలని నిర్ణయం తీసుకుని పర్యటన కొనసాగిస్తున్నారు. ఇక నేడు చంద్రబాబు పర్యటన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో జరుగుతుంది .

కుప్పంలో చంద్రబాబు పర్యటన .. ప్రజా చైతన్య యాత్ర

కుప్పంలో చంద్రబాబు పర్యటన .. ప్రజా చైతన్య యాత్ర

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన నేపధ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు చేరుకున్న బాబు అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్ళబుదుగురుకు చేరుకున్నారు.

కుప్పంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

కుప్పంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

ఇక చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఇవాళ, రేపు ఆయన కుప్పంలో జరిగే ప్రజాచైతన్యయాత్రలో పాల్గొంటారు బాబు. అయితే చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు . దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక తాజాగా ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పం నియోజక వర్గంలో రగడ జరిగింది .ఇక మరోపక్క ఒకపక్క వైసీపీ నేతపై హత్యకు కుట్ర చేశారని ఇక దీనిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది.

చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు... ఉద్రిక్తత

చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు... ఉద్రిక్తత

ఇక ఇదే సమయంలో చంద్రబాబు పర్యటన జరుగుతుంది. దీంతో కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదంటూ వారు చంద్రబాబుపై మండిపడ్డారు .దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది. ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మొహరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+