TTD: తిరుమలకు వెళ్తున్నారా - టీటీడీ కీలక ప్రకటన..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీపావళి వేళ తిరుమలలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, కార్తీక మాసం ఆరంభంతో పాటుగా నవంబర్ నెలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల వివరాలను టీటీడీ ప్రకటించింది. దీపావళి వేళ బ్రేక్ దర్శనాల పైన కీలక నిర్ణయం తీసుకుంది.

దీపావళి ఆస్థానం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది‌.

The details of special festivals to be observed Tirumala in the month of November

తిరుమలలో నవంబర్ మాసంలో జరిగే ప్రత్యేక పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం నిర్వహించనున్నారు.

అదే విధంగా.. పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, నవంబరు 12న ప్రబోధన ఏకాదశి, నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నవంబరు 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కార్తీక మాసం కావటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+