Tomato: కన్నీరు పెట్టిస్తోన్న టమాటా.. భారీగా పెరిగిన ధర..
టమాటా ధరలు చిరుత కంటే వేగంగా పరుగెడుతున్నాయి. పలు చోట్లు కిలో టమాటా రూ.130 నుంచి 150 కూడా పలుకుతున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు ధర పలికింది. కిలో టమాటా రూ.124 లకు పెరిగింది. సాధారణంగా మదనపల్లె మార్కెట్ కు రోజుకు 1500 టన్నుల టమాటా వస్తుంది. గురువారం 700 టన్నుల టమాటా రావడంతో ధర భారీగా పెరిగింది. టమాటా దిగుబడి తగ్గడం.. పలు రాష్ట్రాల్లో వర్షాలకు టమాటా పంటలు దెబ్బతనడంతో ఈ పరిస్థితి ఏర్పాడినట్లు కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
టమాటాలు మాత్రమే కాదు పచ్చి మిర్ఛి ధర కూడా పెరిగింది. పచ్చి మిర్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు పలుకుతోంది. మిగతా కూరగాయల రేట్లు కూడా భారీగా పెరిగాయి. పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చల కూర, మెంతికూర, కొత్తిమీర, బచ్చల్ కూర, గంగవెల్లికూరల ధరలు భారీగా పెరిగాయి. కొత్తిమీర, పుదీనా ధరలు కూడా అంతే ఉన్నాయి. , కాకరకాయ రూ. 100, వంకాయ రూ. 80, బీరకాయ రూ.80, క్యారెట్ రూ.80, దొండకాయ రూ.80, ఉల్లిగడ్డ రూ.30, బెండకాయ రూ. 80, అలచంద రూ.80, దోసకాయ రూ.60, గోరుచిక్కుడ రూ. 80 గా ఉన్నాయి. అటు కోడికూర, కోడి గుడ్డు ధరలు కూడా బాగానే ఉన్నాయి.

కూరగాయల రేట్లు పెరగడంతో చాలా మంది వినియోగదారులు కూరగాయలను కొనడం తగ్గిస్తున్నారు కిలో కొనేవారు అర కిలో కొంటున్నారు. టమాటా ధరలు తగ్గాలంటే నెల నుంచి రెండు నెలలు పట్టే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. టమాటా పంట వేస్తే క్రాఫ్ రావడానికి 60 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు ధరల మోత తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరో వైపు చికెన్, కోడి గుడ్డు రేట్లు కూడా ఎక్కుగానే ఉన్నాయి. కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300 ఉండగా.. కోడి గుడ్డు ఒక్కటి రూ.6 నుంచి రూ.7 ఉంది. కూరగాయల ధరలు పెరడంతో చాలా మంది సామాన్యులు పప్పుల వైపు మొగ్గు చూతుపున్నారు. అయితే పప్పుల ధరలు కూడా ఏం తక్కువగా లేవు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications