ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే వాళ్ళకే టెన్షన్ ఎక్కువ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీలో ప్రతి ఒక్కరిలోనూ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ టెన్షన్ పైన రీల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఏపీ ఎన్నికల పోలింగ్ గురించి ఎలా ఎదురు చూస్తున్నారో జనాల క్రియేటివిటీని ఉపయోగించి బోలెడు వీడియోలు చేస్తున్నారు.
ఏపీ ఫలితాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి, ఈసారైనా ఎన్నికల్లో విజయం సాధించాలని టిడిపి కూటమి హోరాహోరీగా ఎన్నికల సమరం చేశారు. ఇక ఫైనల్ రిజల్ట్స్ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. గెలుపు ధీమాలో ఇరు వర్గాలు ఉండడం ఏపీ ప్రజలను కన్ఫ్యూషన్ కు గురిచేస్తుంది.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రీల్స్
పక్కా లెక్కలతో గెలుస్తున్నాం అంటూ అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి ప్రకటనలు చేస్తున్న క్రమంలో ప్రజలలో టెన్షన్ మరింత పెరుగుతుంది. అసలు ఇంతకీ ఎవరు గెలుస్తున్నారు? ఈ ఎన్నికల్లో ఎవరు పరాజయం పాలవుతున్నారు అన్నది? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే టెన్షన్ వాళ్ళకే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఏపీ ప్రజల టెన్షన్ పై సోషల్ మీడియాలో హంగామా
రెండు వర్గాలు కబడ్డీ ఆడుతుంటే, కబడ్డీ ఆడుతున్న వాళ్ళకంటే, బరి బయట నిలుచును చూస్తున్నవాళ్లే ఆడుతున్న వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న ఒక వీడియో ఏపీ ప్రజల మానసికస్థితికి అద్దం పడుతుంది. ఇక ఆ వీడియోలో పోటీ చేస్తున్న వాళ్ళకంటే ప్రజలకు ఎక్కువ టెన్షన్ అంటూ పేర్కొన్నారు. ఇక ఎన్నికల ఫలితాల కోసం చాలా టెన్షన్ గా చూస్తున్నట్టు సినీ సెలబ్రిటీల ఫోటోలతో కూడా హల్చల్ చేస్తున్నారు.
ఏపీ ఎన్నికలు ప్రజలకే ప్రతిష్టాత్మకం
వాస్తవంగానే ఏపీలో ప్రజలే ఈసారి ఎన్నికలను రాజకీయ వర్గాల కంటే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈసారి టిడిపి కూటమి గెలిచి తీరుతుంది అని కొందరు, సవాలే లేదు వైసీపీ దే విజయమని మరికొందరు, మేము ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తాలూకా కానీ ఇంకొందరు హల్చల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఏపీ ప్రజలకు జరిగిన ఎన్నికలలాగా ప్రస్తుతం ఏపీలో వాతావరణం ఉంది. ఎవరిని కదిలించినా రాజకీయమే మాట్లాడటం ప్రధానంగా కనిపిస్తుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications