పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికలు డూ ఆర్ డై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి రాష్ట్రంలో జనసేన పార్టీని గెలిపించుకోవడం కోసం, రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం తనకు అవకాశం ఉన్న అన్ని మార్గాలలో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పొత్తులతో కూటమిగా ముందుకు వెళుతున్న జనసేన పార్టీకి ఈ ఎన్నికలు డు ఆర్ డై అనే చెప్పాలి.
పదేళ్ళ జనసేన రాజకీయం
గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న జనసేన పార్టీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పదవులు లేకుండా, ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ కోసం పని చేయని పార్టీగా మిగిలిపోయింది. సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి రెండు స్థానాలలోను దారుణ ఓటమి పాలయ్యారు.

జనసేనకు కీలకంగా ఎన్నికలు
ఇక గత ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వైసీపీ బాట పట్టి ఆది నుంచి జనసేనకు దూరంగానే ఉన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, సినిమాలలో తాను సంపాదించిన డబ్బును రాజకీయాలలో ఖర్చుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్న జనసేనానికి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అత్యంత కీలకం.
గత ఎన్నికల్లో ఓడినా జనం కోసం జనసేనాని
ఈసారి ఎన్నికల్లో కూడా జనసేన ఏపీలో ప్రభావాన్ని చూపించకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలలోకి వెళ్లిపోతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలు తనను ఆదరించకపోయినా, ఓటమిపాలైన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఐదేళ్లుగా రాజకీయాలను కొనసాగించారు. ఎన్నో సందర్భాల్లో ప్రజల సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాటం చేశారు.
ఈ ఎన్నికలలో గెలవకుంటే పవన్ పోరాటానికి అర్ధమే లేదు
ఇక ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని ప్రజల ఆదరించకపోతే ఇంత కాలంగా ఏపీ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి అర్థమే ఉండదు. ఈ క్రమంలోనే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక తమ్ముడు కోసం చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ కు డు ఆర్ డై సిట్యువేషన్
ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రాణించాలని చిరంజీవి బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చేయూతనివ్వడం కోసం ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు డు ఆర్ డై సిట్యువేషన్ కావడంతో ఏపీ ఎన్నికల్లో జనసేన చేస్తున్న పోరాటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications