పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇది..షారుక్ ఖాన్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పారట!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఎన్నికల ప్రచారంలో తన గురించి, తాను రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు చేసుకుని హాయిగా బ్రతకాల్సిన తను, ప్రజల సమస్యలను చూసి, ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైరల్
రాజకీయాల్లోకి ఎన్నో విలువలతో వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ప్రజలు తనను ప్రజలు ఆదరించక పోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశానన్నారు. ఇక తన క్యారెక్టర్ గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ అందుకు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అదే పవన్ కళ్యాణ్ మొదటి మరియు చివరి యాడ్
ఇటీవల కాలంలో స్టార్స్ అందరూ కమర్షియల్ యాడ్స్ పైన దృష్టి పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు అని చెప్పిన పవన్ కళ్యాణ్, తాను మాత్రం ఏ సంస్థకు యాడ్ చేయడం లేదని చెప్పారు. గతంలో తను కోకోకోలా కంపెనీకి యాడ్ చేశానని, అదే తన మొదటి మరియు చివరి యాడ్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆ యాడ్ అందుకే వదిలేశా
కోకో కోలా వల్ల హెల్త్ సమస్యలు వస్తాయని తనకు తెలిసిన తరువాత ప్రజలకు మంచిది కానప్పుడు నాకు డబ్బులు వచ్చిన సరే అది నేను చేయకూడదు పని భావించి ఆ యాడ్ వదిలేసాను అని చెప్పుకొచ్చారు. ఆ యాడ్ చేస్తే తనకు షారుక్ ఖాన్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పారని, ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ తనను యాడ్ చేయమని అడిగారని చెప్పారు.
సిద్ధాంతాలకు కట్టుబడే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ది
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నేను నమ్మకాలు వదిలేసి డబ్బుల కోసం యాడ్స్ చేసి ఉంటే బోలెడంత డబ్బు సంపాదించే వాడిని అన్నారు. తాను సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసేవాడిని అని పవన్ కళ్యాణ్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని పవన్ అభిమానులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications