ఏపీలో ఆ హాట్ సీట్లపై వేల కోట్ల బెట్టింగులు.. కాయ్ రాజా కాయ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ కాగా, ఏపీ ఎన్నికలపైన వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపైన ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తుండటం గమనార్హం.
ఏపీ ఎన్నికలపై కాయ్ రాజా కాయ్
ఏపీలో ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధానంగా వైసిపి అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలపైన బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.ఇటు ఏపీలో మాత్రమే కాదు తెలంగాణా రాష్ట్రంలోనూ ఏపీ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ళు కాయ్ రాజా కాయ్ అంటున్నారు.

నారా లోకేష్, షర్మిల స్థానాలపైన బెట్టింగులు
వీరు మాత్రమే కాకుండా మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తాడా? కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల విజయం సాధిస్తారా? భీమిలిలో గంట శ్రీనివాసరావు గట్టెక్కుతాడా? రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తాడా? అన్న దానిపై బెట్టింగులు కొనసాగుతున్నాయి.
గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఈసారి పిఠాపురంలో ఎన్నికల బరిలో ఉన్నారు.
పిఠాపురం, కుప్పం నియోజకవర్గాలపై బెట్టింగులు
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా? లేక అక్కడ వంగా గీత గెలుస్తారా అన్నది చర్చ జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ గెలుస్తారని కొంతమంది, పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎక్కువమంది బెట్టింగులు కడుతున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తామని వైసిపి ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగులు కడుతున్నారు.
పులివెందుల మెజార్టీపై బెట్టింగులు
ఇక ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులలో జగన్ కు వచ్చే మెజారిటీ పైన జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని కొంతమంది, మెజారిటీ తగ్గుతుందని మరికొంతమంది కోట్ల రూపాయల బెట్టింగులు కడుతున్నారు.
మంగళగిరి, రాజంపేటపై కూడా పందేలు
మంగళగిరిలో పోటాపోటీగా నారా లోకేష్ గెలుపు పైన కొందరు ఓడిపోతారని మరికొందరు బెట్టింగ్ కడుతున్నారు. ఇక రాజంపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతారని ఎక్కువమంది, గెలుస్తారని కొందరు బెట్టింగులు కడుతున్నారు.












Click it and Unblock the Notifications