స్కానింగ్: ఇకపై తిరుమలలో ఆ రూల్ తప్పనిసరి!..

Subscribe to Oneindia Telugu

తిరుమల: శ్రీవారి టికెట్లలో పలు అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు.. ఇకపై జారీ చేసే ప్రతీ టికెట్టును స్కానింగ్ చేయనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ విషయంపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

Ticket scanning rule in tirumala

శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాల టికెట్లకు సంబంధించి ఎలాంటి అవకతవకలు లేకుండా చూసేందుకు గట్టి చర్యలు చేపట్టినట్లు సాంబశిరావు పేర్కొన్నారు. వీటి మూలంగానే ఇటీవల నకిలీ టికెట్లు చాలా ఎక్కువగా దొరికిపోతున్నాయని అన్నారు. బ్రేక్ దర్శన టికెట్లను కొనుగోలు చేసే సమయంలో వచ్చే టోకెన్ల సంఖ్యలను తగ్గించామని వెల్లడించారు. డోనర్ మేనేజ్ మెంట్ విధానాన్ని మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. దాతలు కూడా దీనిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో చెప్పుకొచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On tuesday Ttd EO Sambasivarao talked to media on ticket issuing process in tirumala. He said soon ticket scanning process will begin
Please Wait while comments are loading...