సుప్రీంకోర్టు జడ్జీలు కన్‌ఫ్యూజ్ అయ్యారట..
Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. లడ్డూ తయారీ కోసం వినియోగించే నెయ్యి తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదనలు మరింత బలపడ్డాయి.
తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ చంద్రబాబు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వై సత్యకుమార్ సహా పలువురు జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిపై ఓ ఉద్యమమే సృష్టించారు.

పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పునకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటూ దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి మెట్లను సైతం శుభ్రపరిచారాయన. ఇంకో రెండు రోజుల్లో ఈ దీక్ష ముగియాల్సి ఉంది.
చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవాలేమిటనేది దేశ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కల్తీ జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. చంద్రబాబును తప్పుపట్టింది. రాజకీయాలకు కనీసం దేవుళ్లనయినా దూరంగా పెట్టాలంటూ హితబోధ చేసింది.
దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. తాజాగా విజయవాడలో తనను కలిసిన కొద్దిమంది విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను క్లుప్తంగా వెల్లడించారు.
తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా చెప్పలేదని పవన్ కల్యాణ్ అన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే న్యాయమూర్తులు అలా చెప్పి ఉంటారని తాను అనుకుంటున్నట్లు వివరించారు.
నెయ్యి కల్తీపై అందిన ల్యాబొరేటరీ నివేదికల్లో పొందుపరిచిన తేదీల్లో కొంత గందరగోళం ఉందని జడ్జీలు చెప్పారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వాటిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ఒక్క ప్రసాదం విషయంలోనే కాకుండా గత అయిదు సంవత్సరాల్లో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయో వాటన్నింటిపైనా తాము ముందుకే వెళ్తామని,












Click it and Unblock the Notifications