నేను మగాడిని అక్రమ సంబంధం పెట్టుకుంటా -జనసేన నేత..ఏపీ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా..?
ఏపీలో అధికార పార్టీలకు చెందిన నాయకుల రాసలీలలు వీడియోల ట్రెండ్ నడుస్తోంది. అధికారంలో ఉన్న మూడు పార్టీలకు చెందిన నాయకుల లైంగిక వేధింపులకు పాల్పడతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ మధ్య తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో మొదలైన ఈ తతంగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మీతో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి శృంగారం చేసిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే.
తనని లైంగికంగా టీడీపీ ఎమ్మెల్యే లొంగదీసుకున్నారని వరలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.ఆ తర్వాత టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు నాయకులు మహిళలతో పెట్టుకున్న లైంగిక సంబంధాలు వెలుగు చూశాయి. తాజాగా తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని ఓ మహిళ బయటపెట్టింది. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే కిరణ్ రాయల్ మరో అమ్మాయితో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో రికార్డింగ్ వింటే వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.కిరణ్ రాయల్ ఆ అమ్మాయిని లోబర్చుకుని, ఆమెను ఆర్థికంగా ఉపయోగించుకున్నట్టు స్పష్టం అవుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సదరు యువతి హెచ్చరించినప్పటికీ కిరణ్ రాయల్‌లో మార్పు కనిపించలేదు.పైగా ఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తావని ఆమెను బెదరించాడు. నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావ్, నేను మగాడిని ఎంతమందితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటా అంటూ కిరణ్ రాయల్ హేళనగా మాట్లాడాడు.ఆ యువతిని ఆర్థికంగా, లైంగికంగా వాడుకున్న తర్వాత కిరణ్ రాయల్ మరో అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు.
ఆమెకి తెలియకుండానే మరో అమ్మాయితో ప్రేమాయణం.
— oneindiatelugu (@oneindiatelugu) February 9, 2025
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ అమ్మాయి నుంచి కూడా డబ్బు, బంగారం కాజేసిన కిరణ్ రాయల్#KiranRoyal #PawanKalyan #Janasena #Tirupati #AndhraPradesh #OITelugu pic.twitter.com/f6ZdTDwPyF
దీన్ని ప్రశ్నించినందుకే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉంటే కిరణ్ రాయల్ మరో అమ్మాయితో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సదరు మహిళ కిరణ్ రాయల్‌కు గొలుసు గిఫ్ట్‌గా ఇచ్చి ఐ లవ్ యు చెప్పగా, ఐ లవ్ యు టూ అంటూ అతను చెప్పడం జరిగింది. జనసేన సేన పార్టీ నాయకుడు గురించి ఇంత రచ్చ జరుగుతున్న ఆ పార్టీ నాయకత్వం దీనిపై నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పిన వారంత ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications