ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు మీ దృష్టిలో ఏంటి? ఎమ్మెల్యే కొలికపూడి పోస్టుల కలకలం!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఆదివారం కలకలం రేపాయి. తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఇది తీవ్రమైన వివక్షేనని ఆయన ఆరోపించారు.

తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం వల్లే ఇలా జరుగుతోంది. ఇతర సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇలా చేయగలరా? ఎస్సీ, ఎస్టీ, బీసీ శాసనసభ్యులు మీ దృష్టిలో ఏమైనా తక్కువా? అంటూ ఆయన ప్రశ్నించారు. విస్సన్నపేట మండలంలో సీసీ రహదారుల నిర్మాణ ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే జరిగాయని ఆయన తీవ్రంగా స్పందించారు.

Tiruvuru MLA Kolikapudi srinivasa rao Alleges Discrimination Over Development Works Sparks Controversy

నియోజకవర్గంలో అలజడి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని మరో పోస్టులో పేర్కొన్నారు. కొలికపూడి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ తరఫున గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా పనిచేసిన ఆయన తరచు వివాదాల్లో ఉండే వ్యక్తి . ఇటీవలే ఒక పీఈటీ ఉపాధ్యాయుడిని ఇంటికి పిలిపించి దుర్భాషలాడి కొట్టారనే ఆరోపణలు వచ్చాయి.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలను కొలికపూడి ఖండిస్తూ, రుజువు చూపితే తలదించుకుంటానని, లేకపోతే క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. సొంత పార్టీ నేతలపైనే 'తాట తీస్తా' అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పుడు ఆయన అనుచరులు సాంఘిక సంక్షేమ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో బోర్డు ఛైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి కిరణ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, స్థానిక టీడీపీ నాయకులు, ఇతర అధికారుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

సన్నబియ్యం ధరలు పైపైకి: ఎల్ నినో కష్టాలు షురూ!
సన్నబియ్యం ధరలు పైపైకి: ఎల్ నినో కష్టాలు షురూ!

విజయవాడ ఎంపీతో కూడా గతంలో విభేదాలు ఉన్నాయి. అభివృద్ధి పనుల్లో పార్టీ కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తూ ఆయన ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు సమాచారం ఇవ్వకపోవడం, ప్రారంభోత్సవాలకు పిలవకపోవడం వంటి అంశాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.ఎస్సీ, ఎస్టీ, బీసీ శాసనసభ్యుల పట్ల ప్రభుత్వం, పార్టీలో సమాన గౌరవం ఉండాలని ఆయన తన పోస్టుల్లో చెప్పటం టీడీపీ వర్గాల్లో కలకలంగా మారింది. మరి ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+