ఏపీ బంద్: ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు, జగన్ పాదయాత్రకు బ్రేక్

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం బంద్‌ పాటిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కడప, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వివిధ ఆర్టీసీ డిపోల ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌, గుంటూరులోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. పలు చోట్ల బస్సులను డిపోల నుంచి రాకుండా అడ్డుకోగా.. తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సులను నిలిపివేశారు. అయితే, తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపునిచ్చారు.

Today AP Bandh for special status

శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. బంద్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన శ్రేణులు కూడా పాల్గొంటుయి.

సోమవారం జరగాల్సిన వివిధ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కాగా, తిరుపతిలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు.

  ఏప్రిల్‌ 20న నిరాహార దీక్ష : చంద్రబాబు

  బంద్ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. బంద్ శాంతియుతంగా చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి హింసకు, విధ్వంసానికి పాల్పడకూడదని చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని అన్నారు. బంద్ లో టీడీపీ పాల్గొనకపోవడం సరికాదన్నారు. చంద్రబాబు కూడా మోడీ బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు.

  జగన్ యాత్రకు బ్రేక్

  ఏపీ బంద్‌కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తను కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు సోమవారం విరామం ఇచ్చారు. బంద్ లో వైసీపీ శ్రేణులు పాల్గొని నిరసనలు వ్యక్తం చేశాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Bandh continued on Monday for special status. RTC buses are stopped at Depots and schools and colleges are closed.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X