ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్డేట్ చేసుకోవటానికి నేడే లాస్ట్ డేట్.. త్వరపడండి!!
ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ సమాచారంలో తప్పులు దిద్దుకోవటానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సువర్ణావకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డులో మార్పులకు రిజిస్టర్డ్ మీసేవ, ఈసేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి డబ్బులు కట్టి మరీ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఆ అవసరం లేకుండానే ఆధార్ ను ఫ్రీ గా అప్డేట్ చేస్తున్నారు.
అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వాటిని దిద్దుకోవడానికి వాటిని సరి చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్లో నేటి వరకు ఉచితంగా సేవలను అందిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఆధార్ ను దేశవ్యాప్తంగా ఉచితంగా నవీకరించటానికి ఈ అవకాశం ఇస్తున్నారు. సామాన్యులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో ఆధార్ ను రిజిస్టర్డ్ ఆధార్ సెంటర్ లలో మునుపటిలా అప్డేట్ చేసుకోవచ్చు.

కానీ తాజాగా నేటివరకు ఉచితంగా పోర్టల్ లో సేవలందిస్తున్న నేపథ్యంలో ఇక మై ఆధార్ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఈరోజే చివరి రోజు కావటంతో ఏవైనా తప్పులను దిద్దుకోవటం, లోటు పాట్లను సరి చేసుకోవటం చెయ్యండి. ఆధార్ కార్డులను అప్డేట్ చేయడానికి మీరు పోర్టల్ లో కొత్త డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా my Aadhaar పోర్టల్ కు లాగిన్ అవ్వాలి.
పోర్టల్ లో లాగిన్ అవ్వటానికి ముందుగా మనం ఆధార్ కార్డు నంబర్ ను, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆపై క్రిందికి స్క్రోల్ చేసి డాక్యుమెంట్ అప్డేట్ పై క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ అప్డేట్ యాప్ లోకి వెళ్ళిన తర్వాత మనం సరి చెయ్యాలి అనుకున్న వివరాలను సరిచేసి ఆపై హైపర్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి.
స్కాన్ చేసి పెట్టుకున్న ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లను అప్లోడ్ చేయాలి. అప్డేట్ చేయవలసిన అంశాలను అప్డేట్ చేసిన తర్వాత మీకు 14 అంకెల అప్డేషన్ అభ్యర్థన నెంబర్ వస్తుంది. ఇది అప్డేట్ ప్రక్రియ యొక్క దశను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మొత్తం అప్ డేట్ అయిన తర్వాత అప్డేట్ అయిన ఆధార్ కార్డు అందులో జనరేట్ చేయబడుతుంది.
ఫ్రీ గా త్వరితగతిన చేసుకునేలా ఈ ఆధార్ అప్డేషన్ ప్రక్రియకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సమయాన్ని ఇచ్చింది. నేటితో ఇది ముగియనున్న నేపథ్యంలో ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు నేడే చివరి అవకాశం. కాబట్టి డోంట్ మిస్ ఇట్.












Click it and Unblock the Notifications