Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్: నేడు 12గంటలవరకే ఛాన్స్; వాళ్ళు రావొద్దంటున్నటీటీడీ!!

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన అలర్ట్ ఇస్తుంది టిటిడి. తిరుమలలో నేడు జరుగుతున్న కుమారధార తీర్థ ముక్కోటికి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి భక్తులకు సూచనలు చేసింది. టిటిడి ఆధ్వర్యంలో భద్రత ప్రమాణాలను పాటిస్తూ నిఘా తో పాటు, తిరుమల శ్రీవారి భక్తులు కుమారధార తీర్థ ముక్కోటిలో పాల్గొననున్న నేపథ్యంలో అన్ని మౌలిక వసతులను కల్పించింది.

నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు కుమారధార తీర్థానికి పోటెత్తారు. కుమారధార తీర్థంలో స్నానం ఆచరిస్తే రోగాలు తగ్గిపోతాయని, ఆరోగ్యం తిరిగి వస్తుందని, వృద్ధాప్యం పోయి యవ్వనంగా మారతారని, యాక్టివ్ గా ఉంటారని నమ్ముతారు. అందుకే ఈ రోజున విశేషంగా భక్తులు కుమారధార తీర్థానికి వస్తారు.

Today Sri Kumaradhara Tirtha Mukkoti.. TTD key announcements to devotees

ఈ క్రమంలోనే రోగ బాధల నుంచి ఉపశమనం దొరుకుతుందని చాలామంది దీర్ఘకాలిక వ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ తీర్థానికి నడిచి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారు ఎవరు రావద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది. అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా, ఇతర దీర్ఘకాలికవ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్ళడానికి అనుమతి లేదని వెల్లడించింది.

ఇక గోగర్భం నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు టీటీడీ పేర్కొంది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతించడం లేదని వెల్లడించింది. పాప వినాశనం నుండి కుమారధార తీర్థం వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత సిబ్బంది నుంచి పటిష్టమైన చర్యలు చేపట్టామని పేర్కొంది.

మార్గమధ్యంలో తాగు నీటిని అందుబాటులో ఉంచి, అన్న ప్రసాద విభాగ ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగలి, ఉప్మా, సాంబార్ అన్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేసి అందిస్తోంది. ఇక ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు ఇక్కడ అన్నదానం చేయడానికి అనుమతి లేదని టిటిడి వెల్లడించింది.

ఇక భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో సేద తీరడానికి కావలసిన వసతులను ఏర్పాటు చేసి, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే అందుకు తగ్గట్టుగా అంబులెన్స్ లను, డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచి టిటిడి పర్యవేక్షిస్తుంది. కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+