Pawan Kalyan Vs RGV: పిఠాపురంలో పవన్ పై పోటీకి ఆర్జీవీ సై..!

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు అభ్యర్ధుల జాబితాల్ని వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ టీడీపీ రెండో జాబితా కూడా ప్రకటించింది.

అనంతరం జనసేన జాబితా ప్రకటనకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్.. తాను పిఠాపురం సీటులో పోటీ చేయబోతున్నట్లు పార్టీ సోషల్ మీడియా భేటీలో వెల్లడించారు. అయితే ఇదే స్ధానంలో తాను కూడా పోటీకి సై అంటూ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రకటించారు.

tollywood director ramgopal varma announced to contest against pawan kalyan in pithapuram seat

ఇప్పటికే వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యూహం, శపథం చిత్రాలను తీసిన ఆర్జీవీ.. అందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబును టార్గెట్ చేశారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ సైతం తెలంగాణ హైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే చివరికి ఆ చిత్రాల విడుదలకు క్లియరెన్స్ లభించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును సోషల్ మీడియాలో సైతం టార్గెట్ చేస్తున్న ఆర్జీవీ.. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లో తలపడేందుకు సిద్ధమయ్యారు.

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాసేపటికే తాను కూడా అక్కడి నుంచి బరిలోకి దిగుతానంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేయడం సంచలనం రేపింది. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తారన్న సమాచారంతో ఇప్పటికే వైసీపీ అప్రమత్తమై అక్కడ అభ్యర్ధిని మార్చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు బదులుగా కాకినాడ ఎంపీ వంగా గీతను రంగంలోకి దింపింది. ఓ దశలో ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుని పిఠాపురం నుంచి బరిలోకి దింపాలని కూడా భావించింది. ఇప్పుడు పవన్ కు పోటీగా వర్మ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతాయరన్నది సస్పెన్స్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+