టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం... సోదరుడి అకాల మరణం...

ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వాసు సోదరుడు గవర సురేష్‌ శుక్రవారం(డిసెంబర్ 11) రాత్రి అకాల మరణం చెందారు. సురేష్‌కు భార్య, ఓ కొడుకు ఉన్నారు. సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. డీజిల్,పెట్రోల్‌తో నడిచే ఫోర్ వీలర్ వెహికల్స్‌కు సీఎన్‌జీ(కంప్రెసర్,నేచురల్ గ్యాస్) కన్వెర్షన్ కిట్స్ అందించే కంపెనీని కూడా స్థాపించారు.అనతి కాలంలోనే ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన అకాల మరణం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సురేష్ మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

tollywood producer bunny vasu brother passes away

Recommended Video

    TDP Vs YSRCP : Andhra Pradesh లో ఆ పది పోలీస్ స్టేషన్లు వైసీపీ కి అప్పగించండి - TDP

    కాగా,పాలకొల్లుకు చెందిన గవర సూర్య నారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సురేష్ కాగా... చిన్న కుమారుడు బన్నీ వాసు. సురేష్ టాప్ ఆటోమొబైల్ ఇంజనీర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. బన్నీ వాసు నిర్మాతగా టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. 100% లవ్,కొత్త జంట,గీతా గోవిందం,పిల్లా నువ్వు లేని జీవితం తదితర చిత్రాలకు ఆయన నిర్మాత వ్యవహరించారు.ప్రస్తుతం బన్నీ వాసు నిర్మాతగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,చావ బ్రతుకు చల్లగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+