Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఇల్లు కట్టించిన ఆయనకు చంద్రబాబు కీలక పోస్టు ఇస్తారా ?

ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ వ్యవస్థల ప్రక్షాళన పనిలో బిజీగా ఉంది. అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భ్రష్టుపట్టాయని భావిస్తున్న పలు వ్యవస్థల ప్రక్షాళన చేసే క్రమంలో కూటమి సర్కార్ అడుగులు తడబడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో హవా కొనసాగించిన అధికారులకే తిరిగి ఈ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం దక్కుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో మరో కీలక పోస్టు భర్తీకి రంగం సిద్దమవుతోంది.

రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా అప్పటి సీఎం జగన్ టాలీవుడ్ పెద్దలు తనను పట్టించుకోలేదన్న కక్షతో వారిని టార్గెట్ చేసి సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు పెట్టడంతో వారంతా దిగిరాక తప్పలేదు. అయితే అప్పట్లో జగన్ చుట్టూ అలీ, పోసాని, ఆదిశేషగిరిరావు వంటి కొందరు టాలీవుడ్ నటులు, దర్శక నిర్మాతలు చేరి ఈ అరాచకాలకు వంత పాడారన్న విమర్శలు పరిశ్రమతో పాటు టీడీపీ శిబిరం నుంచి కూడా గట్టిగా వినిపించేవి.

tollywood top producers in ap film development corporation chairman race

సీన్ కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్దమవుతోంది. ఇందులో కీలకమైన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ నుంచి ఈ పదవికి పోటీ మొదలైంది. అయితే ఇందులో విచిత్రంగా జగన్ హయాంలో వైసీపీలో ఉన్న నిర్మాత, దివంగత హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా చేరిపోయారు. ప్రస్తుతం గతంలో వైసీపీ నియమించిన పోసాని కృష్ణమురళి ఈ పోస్టులో ఉన్నారు. ఆయన్ను త్వరలో తప్పించి కొత్త ఛైర్మన్ ను నియమించాల్సి ఉంది.

చంద్రబాబు తనయుడు లోకేష్ మద్దతుతో ఆదిశేషగిరిరావు ఎఫ్డీసీ ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విపక్ష నేతగా ఉండగా జగన్ కు తాడేపల్లిలో ఇల్లు కట్టించి ఇచ్చిన ఆదిశేషగిరిరావుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎఫ్డీసీ ఛైర్మన్ పోస్టు ఎలా ఇస్తుందని ఆయన ప్రత్యర్దులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+